కు.ని ఆపరేషన్ల ఫెయిల్.. ఎక్స్‌‌పర్ట్ కమిటీ రిపోర్ట్

కు.ని ఆపరేషన్ల ఫెయిల్.. ఎక్స్‌‌పర్ట్ కమిటీ రిపోర్ట్

హైదరాబాద్, వెలుగు: ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిలై నలుగురి మృతికి కారణమైన వారిపై మూడ్రోజుల్లో చర్యలు తీసుకుంటామని హెల్త్ మినిస్టర్​ హరీశ్‌‌రావు తెలిపారు. ఎక్స్‌‌పర్ట్ కమిటీ రిపోర్ట్ వచ్చిందన్నారు. గురువారం సాయంత్రం ఎంఎన్‌‌జే క్యాన్సర్​ హాస్పిటల్‌‌ను ఎంపీ విజయేంద్ర ప్రసాద్​తో కలిసి మంత్రి పరిశీలించి మాట్లాడారు. ఎంఎన్‌‌జే హాస్పిటల్‌‌లో ఇప్పుడు 400 బెడ్లు ఉన్నాయని, ఇంకో 300 బెడ్ల కెపాసిటీతో కొత్త బిల్డింగ్ నిర్మిస్తున్నామన్నారు.