57 హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ క్లబ్‌‌‌‌‌‌‌‌లపై చర్యలు.. వచ్చే ఎన్నికల్లో పోటీ, ఓటింగ్‌‌‌‌‌‌‌‌పై నిషేధం

57 హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ క్లబ్‌‌‌‌‌‌‌‌లపై చర్యలు.. వచ్చే ఎన్నికల్లో పోటీ, ఓటింగ్‌‌‌‌‌‌‌‌పై నిషేధం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ (హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ)ను గాడిలో పెట్టేందుకు సుప్రీంకోర్టు నియమించిన సింగిల్ జడ్జి,  రిటైర్డ్ జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఎల్. నాగేశ్వరరావు సంఘానికి అనుబంధంగా ఉన్న 57 క్లబ్‌‌‌‌‌‌‌‌లపై  కఠిన చర్యలు తీసుకున్నారు. హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ తదుపరి ఎన్నికల్లో పోటీ చేయకుండా వాటిని నిషేధించారు. ఆఫీస్ బేరర్ల ఎన్నిక, గుర్తింపు, యాజమాన్య బదిలీ, మల్టిపుల్‌‌‌‌‌‌‌‌ ఓనర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌, విరుద్ధ ప్రయోజనాలు తదితర ఫిర్యాదులపై సదరు క్లబ్‌‌‌‌‌‌‌‌ల ప్రతినిధుల నుంచి వివరణ కోరిన తర్వాత వాటిపై చర్యలు తీసుకుంటూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. 

ఈ 57 క్లబ్‌‌‌‌‌‌‌‌లకు చెందిన ఎగ్జిక్యూటివ్​  మెంబర్స్‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌సీఏలో ఎలాంటి పదవీ బాధ్యతలు నిర్వర్తించకుండా బ్యాన్​ చేశారు. ఈ బ్యాన్​ ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ టర్మ్‌‌‌‌‌‌‌‌ ముగిసేవరకు లేదంటే మూడేళ్ల పాటు ఉంటుంది. ఎన్నికల్లో ఆయా క్లబ్‌‌‌‌‌‌‌‌లకు ఓటు హక్కు కూడా ఉండబోదు. అయితే, ఈ క్లబ్‌‌‌‌‌‌‌‌లకు చెందిన  జట్లు హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ లీగ్స్‌‌‌‌‌‌‌‌, టోర్నీల్లో పాల్గొనేందుకు అనుమతించారు.