పుట్టపర్తిలో రాళ్ల దాడి చేసుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు

పుట్టపర్తిలో  రాళ్ల దాడి చేసుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు

అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో వైసీపీ, టీడీపే నేతల కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకున్నారు. స్థానికంగా ఉన్న సత్యమ్మ ఆలయం వద్దకు రావాలని టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యీ శ్రీధర్ రెడ్డి సవాళ్లు విసురుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయానికి చేరుకున్న పల్లె రఘునాథ్ రెడ్డి కారును అధికార పార్టీ కార్యకర్తలు ద్వంసం చేశారు. దీంతో ఆయన, పలువురు టీడీపీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే  భారీగా మోహరించిన పోలీసులు.. ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆందోళన చేస్తోన్న  రఘునాథ్ రెడ్డిని అరెస్ట్ పోలీసు వాహనం లో తరలిస్తుండగా.. ఆయన స్పృహ తప్పి పడిపోయారు. 

ఒకానొక సమయంలో టీడీపీ, వైసీపీ వర్షాలు తీవ్ర దాడులకు పాల్పడ్డారు. రాళ్లు, చెప్పులను విసురుకుంటూ టైన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. దీంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయం పరిసర ప్రాంతాల నుంచి చేరుకున్న ఇరువురి నేతల కార్యకర్తల్ని పోలీసులు అక్కడ్నుంచి పంపించి వేశారు. లాఠీ చార్జి చేసి ఆందోళన సద్దుమణిగేలా చేశారు. ప్రస్తుతం పుట్టపర్తిలో పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు స్పష్టం చేశారు.