తమ కుమార్తె పెళ్లికి మెగాస్టార్ ను ఆహ్వానించిన ఆలీ దంపతులు

తమ కుమార్తె పెళ్లికి మెగాస్టార్ ను ఆహ్వానించిన ఆలీ దంపతులు

నటుడు ఆలీ దంపతులు తమ కుమార్తె వివాహానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. ఈ మేరకు వారు మెగాస్టార్ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. ఆలీ కుమార్తె వివాహం ఈ నెల 27న జరగనుంది. అయితే ఈ వేడుకకు ఆలీ దంపతులు అతిథులను ఆహ్వానిస్తున్నారు.

ఇటీవల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని, తెలంగాణ గవర్నర్ తమిళిసైని ఆలీ తన కుమార్తె పెళ్లికి ఆహ్వానించారు. తాజాగా మెగాస్టార్ ని కూడా కలసి తమ ఇంట జరిగే శుభకార్యానికి రావాలని కోరారు. ఆలీ కుమార్తె ఫాతిమా డాక్టర్ చదివింది. ఆమెకు షహనాజ్ అనే వ్యక్తితో పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలీ దంపతులు ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.