
తమిళ హీరో చియాన్ విక్రమ్ అనారోగ్యం పాలయ్యారు. స్వల్ప అస్వస్థతకు లోనవడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ రోజే ఆయనను డిశ్చార్జి చేసే అవకాశముందని విక్రమ్ మేనేజర్ ప్రకటించారు. అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు.
Actor #ChiyaanVikram is admitted in a Chennai hospital due to high fever..
— Ramesh Bala (@rameshlaus) July 8, 2022
His fever has reduced now..
Wishing him a speedy and complete recovery..
విక్రమ్ ఆరోగ్యంపై ఆయన మేనేజర్ సూర్యనారాయణన్ క్లారిటీ ఇచ్చారు. ఛాతీలో అసౌకర్యంగా ఉండటంతో ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని, ప్రస్తుతం ట్రీట్ మెంట్ కొనసాగుతోందని చెప్పారు. హార్ట్ అటాక్ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. గుండెపోటు వచ్చిందన్న పుకార్లు ఎంతగానో బాధించాయని అన్నారు. ఈ సమయంలో ఆయనకు, కుటుంబానికి ప్రైవసీ అవసరమని, తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని కోరారు.