బెంగళూరు: కన్నడ సినీ నటుడు దర్శన్కు కర్నాటక హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దర్శన్కు శస్త్ర చికిత్స జరగాల్సి ఉండటంతో ఆరు వారాల తాత్కాలిక బెయిల్ను న్యాయస్థానం మంజూరు చేసింది. అభిమానిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో దర్శన్ కటకటాలపాలైన సంగతి తెలిసిందే. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దర్శన్కు తాత్కాలికంగా ఊరట లభించింది. జస్టిస్ ఎస్.విశ్వజిత్ శెట్టి దర్శనకు బెయిల్ మంజూరు చేశారు.
బ్యాక్ పెయిన్ కారణంగా తనకు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని, బెయిల్ మంజూరు చేయాలని దర్శన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారించిన కర్నాటక హైకోర్టు అతని అభ్యర్థనను మన్నించి బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ మంజూరు సందర్భంలో దర్శన్ కు కోర్టు కొన్ని షరతులు పెట్టింది. దర్శన్ తన పాస్పోర్ట్ను సరెండర్ చేసి, తాను కోరుకున్న హాస్పిటల్ లో ఏడు రోజుల లోపు ట్రీట్మెంట్ తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే..
చిత్రదుర్గలోని ఓ మెడికల్ ఫార్మసీలో ఉద్యోగి అయిన రేణుకాస్వామి అభిమానుల వర్గాల్లో ఛాలెంజింగ్ స్టార్గా ఫేమస్ అయ్యాడు. అతడు దర్శన్‌కి వీరాభిమాని. అయితే వివాహితుడైన దర్శన్తో -పవిత్ర గౌడ వివాహేతర సంబంధం కొనసాగించడం ఈ అభిమానికి నచ్చలేదు. ఇది దర్శన్ ప్రతిష్టను దిగజార్చిందని రేణుకాస్వామి భావించాడు. అతడు నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సృష్టించాడు. పవిత్రకు అసభ్యకరమైన సందేశాలు పంపడం.. ఆమె పోస్ట్‌లపై అసభ్యకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ విషయం దర్శన్కు తెలిసి ఓ గ్యాంగ్కు రూ.30 లక్షలు ఇచ్చి హత్య చేయించినట్లు తెలిసింది. అడ్వాన్స్గా ముందు దర్శన్ వారికి రూ.5 లక్షలు ఇచ్చాడు.
రేణుకా స్వామి మృతదేహం కామాక్షిపాళ్యంలోని మురుగు కాలువలో పడి ఉంది. ఫుడ్ డెలివరీ ఏజెంట్ కుక్కలు తినేస్తున్న మృతదేహాన్ని మొదట గుర్తించాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి అతడు దర్శన్ అబిమాని రేణుకాస్వామి అని గుర్తించారు. దీంతో తొలుత ఇద్దరు వ్యక్తులు కామాక్షిపాళ్యం పోలీసులకు లొంగిపోయి హత్య చేసినట్లు అంగీకరించారు.
ALSO READ : NishadhYusuf: 43 ఏళ్ల కంగువ ఎడిటర్.. ఇంట్లో శవమై అలా ఎలా?
ఆర్థిక తగాదాలే హత్యకు కారణమని వారు వాంగ్మూలం ఇచ్చారు. అయితే, పోలీసులు వారి వాంగ్మూలంలో తేడాలున్నాయని గుర్తించి విచారించారు. ఈ విచారణలో దర్శన్ సహా ఇతరుల పాత్ర బయటపడింది. తదనంతరం మైసూర్‌లోని దర్శన్,- పవిత్రను పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుకా స్వామిని దర్శన్, పవిత్ర అత్యంత కిరాతకంగా చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లు పోలీసు విచారణలో తేలింది.