200కోట్ల దోపిడి కేసులో బాలీవుడ్ నటికి బిగుస్తున్న ఉచ్చు

200కోట్ల దోపిడి కేసులో బాలీవుడ్ నటికి బిగుస్తున్న ఉచ్చు

మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్కు ఈడీ ఉచ్చు బిగుస్తోంది. 200కోట్ల దోపిడి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్ పై మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ను కూడా ఈడీ నిందితురాలిగా పేర్కొంది. కోర్టులో దాఖలు చేసిన చార్జ్షీట్లో ఆమె పేరును చేర్చింది. దోపిడి ద్వారా వచ్చిన డబ్బు ద్వారా ఆమె లబ్ది పొందినట్లు ఈడీ వెల్లడించింది. 

సుకేష్ చంద్రశేఖర్ దోపిడి చేసిన సొమ్ములో నుంచి 5.71కోట్ల విలువైన వివిధ బహుమతులను జాక్వెలిన్కు ఇచ్చినట్లు ఈడీ చార్జ్షీట్లో పేర్కొంది. ఈ బహుమతుల్లో 52లక్షల విలువైన గుర్రం..9లక్షల విలువైన పర్షియన్ పిల్లి ఉన్నట్లు ఈడీ తెలిపింది. దోపిడి ద్వారా వచ్చిన సొమ్ము నుంచి బహుమతులు ఇస్తున్నట్లు ఆమెకు తెలుసని ఈడీ ఆరోపించింది. ఇప్పటికే జాక్వెలిన్ కు చెందిన 7కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసులో మొత్తం 8మందిని ఈడీ అరెస్ట్ చేసింది.

కాగా రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి సుకేష్ ఏకంగా 200కోట్లు వసూల్ చేశాడు. అయితే బెయిల్ విషయం దాటవేస్తుండడంతో శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 2021లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగా..జైల్లో ఉండి కూడా అతడు నేరాలను కొనసాగించినట్లు ఈడీ గుర్తించింది.