Jayam Ravi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జయం రవి, సింగర్ కెనీషా.. ఫోటోలు వైరల్

Jayam Ravi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జయం రవి, సింగర్ కెనీషా.. ఫోటోలు వైరల్

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తమిళ సినీ హీరో జయం రవి దర్శించుకున్నా రు. ఇవాళ (ఆగస్ట్ 25న) ఉదయం సుప్రభాత సేవలో జయం రవితో పాటు అతని రూమర్ గర్ల్‌ఫ్రెండ్, సింగర్ కెనీషా కూడా కనిపించింది. వీరిద్దరూ కలిసి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శన అనంతరం రంగనాయ కుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, తమపై వస్తున్న రూమర్స్పై వీరిద్దరూ ఎప్పుడు ఖండించకపోవడం గమనార్హం !

ఎవరీ కెనిషా ఫ్రాన్సిస్:

హీరో జయం రవి తన భార్య 'ఆర్తి' నుండి విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. 15 సంవత్సరాల వివాహం తర్వాత తన భార్యతో విడిపోతున్నట్లు జయం రవి తెలుపడంతో.. సడెన్గా బెంగళూరుకు చెందిన సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ వార్తల్లో నిలిచింది. కొన్నాళ్లుగా వీళ్లు రిలేషన్‌లో ఉన్నారనే రూమర్ బాగా వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ మధ్య పలు ఈవెంట్లకు కలిసే వెళ్తున్నారు.

ఇటీవలే చెన్నైలో జరిగిన నిర్మాత ఇషారి గణేష్ కుమార్తె వివాహానికి నటుడు రవి, అతని రూమర్ గర్ల్ ఫ్రెండ్, సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ అటెండ్ అయ్యారు. ఈ జంట ఒకేరకమైన దుస్తులలో వచ్చి ఫంక్షన్ మొత్తం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఒకే ఫంక్షన్లో ఒకటిగా రావడం, చేతులు పట్టుకుని నడవడం వంటి ఫోటోలు, వీడియోలు వైరల్ కూడా అయ్యాయి.