Mahesh Manjrekar Wife: అదుర్స్ విలన్ మొదటి భార్య కన్నుమూత.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కుమారుడు సత్య

Mahesh Manjrekar Wife: అదుర్స్ విలన్ మొదటి భార్య కన్నుమూత.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కుమారుడు సత్య

బాలీవుడ్ నటుడు-అదుర్స్ విలన్ మహేష్ మంజ్రేకర్ మొదటి భార్య మరణించారు. నటుడు మహేష్ మాజీ భార్య అయిన దీపా మెహతా సెప్టెంబర్ 29న తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో తల్లి మరణ వార్తను కుమారుడు సత్య మంజ్రేకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'మిస్ యూ అమ్మా.. నిన్ను చాలా మిస్ అవుతున్నాను' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. దీపా మెహతా మరణ వార్త విన్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాళులు అర్పించారు.

కాలేజ్ డేస్లో పరిచయమైన దీపా మెహతా, మహేష్ మంజ్రేకర్ 1987లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు, కుమార్తె అశ్వమి మంజ్రేకర్ మరియు కుమారుడు సత్య మంజ్రేకర్ ఉన్నారు. అయితే, మహేష్ మంజ్రేకర్, దీపా మెహతా దంపతులు 1995లో విభేదాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత నటుడు మహేష్ మంజ్రేకర్, మేధా మంజ్రేకర్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి సాయి మంజ్రేకర్ అనే కుమార్తె ఉంది. దబాంగ్ 3 తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది 

దీపా మెహతా విషయానికి వస్తే.. ఇండస్ట్రీలో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్గా గుర్తింపు పొందారు. ‘క్వీన్ ఆఫ్ హార్ట్స్’ అనే చీర బ్రాండ్‌కు వ్యవస్థాపకురాలు. చేతితో నేసిన చీరలు, బ్లౌజ్‌లు, చేతితో చిత్రించిన చీరలు, మరియు ఇతర సంప్రదాయ భారతీయ దుస్తులను అందిస్తుంది. మరాఠీ చిత్ర పరిశ్రమతో పాటు బాలీవుడ్ లోనూ విజయవంతంగా రాణించింది. ఆమె కుమార్తె అశ్వమి ఈ బ్రాండ్‌కు మోడల్‌గా పనిచేస్తూనే నటిగా కొనసాగుతుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Deepa Mehta (@deepamehta)

మహేష్ మంజ్రేకర్: వాస్తవ్ ది రియాలిటీ (1999) మూవీతో డైరెక్టర్గా మారారు. ఇందులో సంజయ్‌దత్‌, మహేష్ బాబు వైఫ్ నమ్రత హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. వాస్తవ్‌ హిట్టవడంతో దర్శకుడు మహేశ్‌ దీనికి సీక్వెల్‌గా హత్యార్‌ తీశాడు. ఆ తర్వాత బాలీవుడ్ లో చిత్ర నిర్మాత దర్శకుడిగా రాణిస్తూనే నటుడిగా కొనసాగుతున్నారు. తెలుగులో ఎన్టీఆర్ కల్ట్ కామెడీ ఫిల్మ్ అదుర్స్, ప్రభాస్ సాహో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు.