పొలిటికల్ డ్రామాగా నితిన్ ‘నియోజకవర్గం’

V6 Velugu Posted on Sep 12, 2021

ఏదో ఒక వెరైటీ ఉంటే తప్ప సినిమాలు యాక్సెప్ట్ చేయడం లేదు నితిన్. తన ముప్ఫై ఒకటో సినిమా కోసం కూడా ఓ డిఫరెంట్ సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌ని లైన్‌‌‌‌‌‌‌‌లో పెట్టాడు. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. హీరో హీరోయిన్లపై తీసిన మొదటి షాట్‌‌‌‌‌‌‌‌కి అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ప్రొడ్యూసర్ రామ్మోహన్ కెమెరా స్విచాన్ చేశారు. అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ఎమ్మెస్ రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మాచర్ల నియోజకవర్గం’ అనే టైటిల్‌‌‌‌‌‌‌‌ని ఫిక్స్ చేశారు. కృతీశెట్టి హీరోయిన్‌‌‌‌‌‌‌‌. నితిన్ నటించిన భీష్మ, మాస్ట్రో చిత్రాలకు పని చేసిన మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షూటింగ్‌‌‌‌‌‌‌‌ మొదలు కానుంది. ఇదో సీరియస్ పొలిటికల్ డ్రామా అని టైటిల్‌‌‌‌‌‌‌‌తో పాటు మోషన్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారానూ అర్థమవుతోంది. భగభగ మండే మంటల మధ్య కత్తులు దూస్తున్న శత్రువులతో యుద్ధానికి సిద్ధమయ్యాడు నితిన్. చూస్తుంటే కాస్త పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌ కాన్సెప్టే అనిపిస్తోంది.

 

Tagged Movies, Krithi Shetty, tollywood, actor nithiin, sreshth movies, nithiin new movie

Latest Videos

Subscribe Now

More News