సలార్ వార్

V6 Velugu Posted on Aug 17, 2021

భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌‌‌‌గా మారిన ప్రభాస్.. ప్రతి కాన్సెప్ట్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు. ఇటీవల వింటేజ్ లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’ షూటింగ్ కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం మరో మూడు భారీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ‘కేజీయఫ్‌‌‌‌’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ‘సాలార్’ వాటిలో ఒకటి. ‘రాధేశ్యామ్’ తరహాలో ఇది కూడా పీరియాడిక్ మూవీనే అని రీసెంట్‌‌‌‌గా తెలిసింది. ఇండియా, పాకిస్థాన్‌‌‌‌ల మధ్య జరిగిన యుద్ధం ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందట. ప్రభాస్ తండ్రీకొడుకులుగా కనిపిస్తాడని, తండ్రి పాత్ర ఫ్లాష్‌‌‌‌బ్యాక్‌‌‌‌లో ఉంటుందని, అతనో సైనికుడని ఆల్రెడీ వార్తలు వచ్చాయి. దాన్నిబట్టి ఇప్పుడీ న్యూస్ కూడా నిజమేననిపిస్తోంది. ఇటీవల విడుదలైన అజయ్ దేవగన్ ‘భుజ్‌‌‌‌’ కూడా ఇండో–పాక్ వార్ ఆధారంగా రూపొందిన చిత్రమే. అయితే దాన్ని పూర్తిగా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారు. కానీ ప్రభాస్ సినిమా సంగతి వేరు. హిస్టారికల్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌ అయినప్పటికీ పూర్తి ఫిక్షనల్ స్టోరీతో తీస్తున్నాడట ప్రశాంత్ నీల్. తను దీన్నో రెట్రో మాస్ సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌‌‌‌కి జంటగా శ్రుతీహాసన్ నటిస్తోంది. విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్‌‌‌‌తో నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్‌‌‌‌‌‌‌‌ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాతో పాటు హిందీ మూవీ ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’ కూడా చేస్తున్నాడు ప్రభాస్.

Tagged Movies, RadheShyam, tollywood, salaar, Prabhaas, aadipurush

Latest Videos

Subscribe Now

More News