Darling Announcement Glimpse: బ్యూటీ నభా నటేష్ను..నిజంగానే డార్లింగ్ అంటున్న ప్రియదర్శి

Darling Announcement Glimpse: బ్యూటీ నభా నటేష్ను..నిజంగానే డార్లింగ్ అంటున్న ప్రియదర్శి

వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపును అందుకున్న ప్రియదర్శి (Priyadarshi).. జాతిరత్నాలు, మల్లేశం, బలగం లాంటి చిత్రాలతో హీరోగానూ మెప్పించాడు. ఈ క్రమంలో అతను హీరోగా వస్తోన్న లేటెస్ట్ మూవీకి డార్లింగ్ (Darling) అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ..టైటిల్ గ్లింప్స్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.

తమిళ్ దర్శకుడు అశ్విన్ రామ్  తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో..ప్రియదర్శికి జోడిగా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటిస్తుంది. అయితే గత మూడ్రోజులుగా సోషల్ మీడియాలో డార్లింగ్ అనే పదంపై ప్రియదర్శికి, నభా నటేష్ కు మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ వీడియోతో..వీరి గొడవంత ఒట్టి తూచ్ అనే విషయం ఆర్డమైపోయింది. 

Also Read:విజయ్ ఆంటోనీ ల‌వ్‌గురు ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది..తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇక టీజర్ విషయానికి వస్తే..ఇందులో భార్య భర్తల మధ్య జరిగే గొడవ నేపథ్యంలో డార్లింగ్ కథ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఒక తల్లిలా,చెల్లిగా ఉన్నప్పుడు ప్రేమ ఒకలా..లవర్ గా..ఇక లవర్ భార్యగా అయితే పిచ్చి పిక్స్ అనేలా ఉంటుందనే కాన్సెప్ట్ పాతదే అయిన వీడియోలో పెర్ఫార్మన్స్ మాత్రం అదిరిపోయింది.  

హనుమాన్ మూవీని నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.డీసెంట్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, మురళీధర్ గౌడ్, శివ రెడ్డి మరియు కృష్ణ తేజ వంటి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.