
తమిళ హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిచ్చగాడు సినిమా అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు. జయాపజయాలంతో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తూ ఉంటారు విజయ్. అంతేకాదు..నార్మల్ కమర్షియల్ సినిమాలు కాకుండా రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేయడం ఆయన స్పెషాలిటీ.
మరోసారి అలాంటి కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్.అదే లవ్ గురు(Love Guru). భార్యాభర్తల మధ్య సాగే ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు.ట్రైలర్ తో ఆసక్తిని కలిగించిన ఈ సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటీవ్ టాక్ ను తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగుస్తుండటంతో ఓటీటీ ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నం చేస్తున్నారు.
లవ్ గురు ఓటీటీ
విజయ్ ఆంటోనీ లవ్ గురు త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.మే 3 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.అయితే,ఈ మూవీ తమిళంలో రోమియో టైటిల్ తో రిలీజైంది. తమిళ వెర్షన్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది.
తెలుగులో మాత్రం ఆహా ఓటీటీ, తమిళంలో అమెజాన్ ప్రైమ్‌లో మే 3న ఈ మూవీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. త్వరలో లవ్ గురు ఓటీటీ రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
లవ్ గురు కథ:
ఈ సినిమా అంతా భార్య భర్తల మధ్యే సాగే ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. పెళ్లంటే అంటే ఇష్టం లేని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న వ్యక్తి తన భార్య ప్రేమను ఎలా పొందుతాడు అనేది లవ్ గురు కథ. సినిమాలో విజయ్ ఆంటోనీ పాత్ర చాలా బాగా పండింది. మరీ ముఖ్యంగా ఆయనపై ఆయన వేసుకునే సెటైర్స్ ఆడియన్స్ ను ఫుల్లుగా నవ్విస్తాయి. మంచి కాన్సెప్ట్, ఎమోషనల్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు.