
భారీ వర్షాల కారణంగా తాను లేహ్‌లో "చిక్కుకుపోయాను" అని నటుడు ఆర్ మాధవన్ వీడియో షేర్ చేశారు. మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఎడతెరుపు లేని వర్షాల కారణంగా విమానాలు రద్దు కావడంతో లేహ్‌లో ఉండిపోవాల్సి వచ్చిందని హీరో మాధవన్ అన్నారు.
ఈ క్రమంలో తన హోటల్ గది కిటికీ నుండి మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు చూపిస్తూ తన పరిస్థితిని వివరించారు. 2008లో 3 ఇడియట్స్ షూటింగ్ కోసం లడఖ్‌కు వెళ్ళినపుడు కూడా ఇలాంటి సంఘటనను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు.
లేహ్ (లఢక్ రాజధాని) వాతావరణం గురించి మాధవన్ మాట్లాడుతూ.. ‘‘ షూటింగ్ కోసం ఈ ప్రాంతానికి వచ్చిన రోజు నుంచే విపరీతంగా మంచు కురుస్తోంది. ఇక్కడ నాలుగు రోజులుగా ఎడతెపులేని వర్షాల వల్ల విమానాశ్రయాలు కూడా రద్దు చేయబడ్డాయి. ఈ క్రమంలో నేను లేహ్‌లోనే చిక్కుకుపోయాను. ఇపుడే కాదు నేను లఢక్ వచ్చిన ప్రతిసారీ ఇలాగే జరుగుతోంది. ఈ రోజైనా వర్షం తగ్గాలని విమానాల రాకపోకలు సాగి నేను ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నా’’ అని మాధవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే 3 ఇడియట్స్ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన విషయాన్నీ గుర్తు చేసుకున్నారు. 'నేను చివరిసారిగా 2008లో పాంగోంగ్ సరస్సు వద్ద 3 ఇడియట్స్ షూటింగ్ కోసం (ఇదే ఆగస్టులో) ఇక్కడికి వచ్చాను. అప్పుడు కూడా అకస్మాత్తుగా మంచు కురుస్తున్నందున మా టీమ్ మొత్తం ఇలానే చిక్కుకుపోవాల్సి వచ్చింది. ఇప్పుడు వాతావరణం అనుకూలిస్తుందని, విమానాలు ల్యాండ్ కాగలవని, నేను ఇంటికి చేరుకోగలనని.. మాధవన్ వీడియో ద్వారా చెప్పుకొచ్చారు.
ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో ఆయన ఫ్యాన్స్, సెలెబ్రెటీలు 'మాధవన్ సేఫ్గా ఇంటికి చేరుకోవాలని' కోరుతూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం మాధవన్ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ముఖ్యంగా రాజమౌళి- మహేష్ బాబు SSMB29లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.