LokeshKanagaraj: అంచనాలు పెంచేసిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. లారెన్స్తో మూవీ అనౌన్స్..టైటిల్, టీజర్ రిలీజ్

LokeshKanagaraj: అంచనాలు పెంచేసిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. లారెన్స్తో మూవీ అనౌన్స్..టైటిల్, టీజర్ రిలీజ్

లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)..ఆడియన్స్కు ఈ పేరు వింటే..ఏదో మ్యాజిక్..అదేదో తెలియని స్ట్రాంగ్ ఫీలింగ్ కలుగుతుంది. అందుకు కారణం లేకపోలేదు..లోకేష్ తెరకెక్కించిన నగరం మూవీ నుంచి మొన్నటి లియో వరకు ఆడియన్స్లో ఒక గట్టి నమ్మకాన్ని ఇచ్చారు. తీసింది కేవలం ఐదు సినిమాలే కానీ, క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో తన సినిమాలకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ను క్రియేట్ చేసుకున్నాడు లోకేష్. 

ఆయన తెరకెక్కించిన ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలు అయితే మరో ఎత్తు. ఈ సినిమాలతో లోకేష్ అంటే ఇది అనేలా ఒక సిగ్నేచర్ క్రియేట్ చేసేశాడు. దీంతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనేది కూడా ఫ్యాన్స్ ఫాలో అయ్యేలా చేశాడు.

ఈ నేపథ్యంలో లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్లో మరో స్టార్ హీరో వచ్చి చేరాడు. తనదైన సినిమాలతో.. సేవా కార్యక్రమాలతో పాన్ ఇండియా వైడ్గా అభిమానులను సొంతం చేసుకున్న రాఘవ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా..కొత్త సినిమాను ప్రకటించాడు లోకేష్. ఈ సినిమాకు బెంజ్ (BENZ) అనే టైటిల్ను ఫిక్స్ చేస్తూ టీజర్ కూడా రిలీజ్ చేశారు.

Also Read : 43 ఏళ్ల కంగువ ఎడిటర్.. ఇంట్లో శవమై అలా ఎలా?

లారెన్స్ బర్త్డే స్పెషల్గా టీజర్ రిలీజ్ చేస్తూ.. వచ్చిన ఈ టీజర్ చుస్తే "కారణంతో పోరాడే యోధుడు.. సైనికుడికంటే ఎక్కవు ప్రమాదకరం. వెల్కమ్ టు మై సినిమాటిక్ యూనివర్స్ మాస్టర్.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ లోకేష్ తెలిపారు. కాగా ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ కథ అందించగా.. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్నాడు.

అలాగే లారెన్స్ బర్త్ డే స్పెషల్ గా అతని నుండి మరో రెండు సినిమాల అప్డేట్స్ వచ్చాయి. అందులో ఒకటి రమేష్ వర్మ డైరెక్ట్ చేయనున్న'కాల భైరవ' మరొకటి ఇన్నాసి పాండియన్ దర్శకత్వంలో వస్తోన్న బుల్లెట్ బండి. ఈ సినిమాల పోస్టర్స్ రిలీజ్ అయ్యి..అంచనాలు పెంచేస్తోన్నాయి.