కాలర్ ఎగరేసేలా ఆంధ్రకింగ్ తాలుకా

కాలర్ ఎగరేసేలా ఆంధ్రకింగ్ తాలుకా

రామ్, భాగ్యశ్రీ బోర్సే జంటగా ఉపేంద్ర కీలక పాత్రలో   పి.మహేష్ బాబు రూపొందించిన చిత్రం  ‘ఆంధ్రకింగ్ తాలూకా’.  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  వై రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మించారు.  నవంబర్ 27న సినిమా విడుదల కానుంది. తాజాగా వైజాగ్‌‌‌‌లో మ్యూజిక్ కాన్సర్ట్‌‌‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ఇంత బ్యూటిఫుల్‌‌‌‌గా రావడానికి చాలా మంది కష్టం ఉంది. ఇది  నా కెరీర్‌‌‌‌‌‌‌‌లోనే  గర్వపడే మూవీ.  ఏదైనా కొత్తగా చేయాలనుకున్నప్పుడు మహేష్ నా జీవితంలోకి వచ్చాడు. 

తనతో వర్క్ చేయడం మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్.  గ్లామర్‌‌‌‌‌‌‌‌తో పాటు మంచి పెర్ఫార్మ్ చేసే హీరోయిన్ భాగ్యశ్రీ.  ఉపేంద్ర గారితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా.  రవి గారు,  నవీన్ గారు చాలా ప్యాషన్  ఉన్న ప్రొడ్యూసర్స్.  వివేక్, మార్విన్ తెలుగు సినిమాకి ఒక కొత్త సౌండ్ తీసుకొచ్చారు. ఈ ఆల్బం గుండెల్లో నిలిచిపోతుంది’ అని చెప్పాడు. రామ్‌‌‌‌లాంటి ఎనర్జిటిక్ హీరోతో నటించడం హ్యాపీ అని భాగ్యశ్రీ చెప్పింది. 

ఉపేంద్ర మాట్లాడుతూ ‘ఈ సినిమా చూసిన రామ్ ఫ్యాన్స్  కాలర్ ఎగరేసుకుంటూ బయటికి వస్తారు. అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది’ అని అన్నారు. డైరెక్టర్ మహేష్ మాట్లాడుతూ ‘ఎవర్నో  ఒకరిని అభిమానించకుండా ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. లైఫ్‌‌‌‌లో ఎన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయో ఒక ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా’ అని చెప్పాడు. ఒక మెసేజ్‌‌‌‌ని కమర్షియల్ ఎలిమెంట్స్‌‌‌‌తో చూడబోతున్నారని నిర్మాత రవిశంకర్  అన్నారు.