
తెలుగు ‘బిగ్‌బాస్’ షోను కొత్త స్టార్ హోస్ట్ చేయబోతున్నారా? అక్కినేని నాగార్జున స్థానంలో రానా వస్తున్నాడా? ప్రస్తుతానికి వినిపిస్తున్న బజ్ ప్రకారం ‘బిగ్‌బాస్–5’ సీజన్‌ను రానా హోస్ట్ చేసే అవకాశాలున్నాయి. ‘బిగ్‌బాస్’ మూడు, నాలుగు సీజన్స్ హోస్ట్ చేసిన స్టార్ హీరో నాగార్జున స్థానాన్ని, ఈసారి యంగ్ హీరో రానా భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ‘స్టార్ మా’ ఛానెల్‌లో వచ్చిన ‘బిగ్‌బాస్’ నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో ఐదో సీజన్ స్టార్ట్ అవుతుంది. దీనికోసం కూడా నాగార్జుననే హోస్ట్‌గా అనుకున్నారు. అయితే, ఆయన ఆ టైంలో షూటింగ్స్‌లో బిజీగా ఉంటారట. దీంతో నిర్వాహకులు కొత్త హోస్ట్ కోసం చూశారు. ఇప్పటికే ‘నెంబర్ వన్ యారి’ షో ద్వారా హోస్ట్‌గా ప్రూవ్ చేసుకున్న రానా అయితే బెటర్ అని, ఆయన్ను సెలక్ట్ చేశారు. ప్రస్తుతం రానాతో డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే స్టార్ట్ అవ్వాల్సిన ఐదో సీజన్ కరోనా కారణంగా వాయిదాపడుతూ వస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ కోసం సెలబ్రిటీలతో చర్చలు జరుపుతున్నారు.