‘మా’ను నడపడం మనకు చేతకాదా?

‘మా’ను నడపడం మనకు చేతకాదా?

‘మా’ ఎన్నికలపై నటుడు, డైరెక్టర్ రవిబాబు సంచలన కామెంట్స్ చేశారు. ‘మా’ ఎన్నికలు కచ్చితంగా లోకల్, నాన్ లోకల్ ఇష్యూ కానేకాదని ఆయన స్పష్టం చేశారు. ‘మా’ అసోసియేషన్ నడపడం మనకు చేతకాదా.. ఎవరో వచ్చి మనకు నేర్పించాలా అని ప్రశ్నించారు. ‘మా’ ఎన్నికలపై జరుగుతున్న వివాదాలను దృష్టిలో ఉంచుకొని రవిబాబు మీడియాతో మాట్లాడారు.

‘ఇతర భాషల క్యారక్టర్ ఆర్టిస్టులను ఇక్కడకు తీసుకొచ్చి అవకాశాలు ఇస్తున్నారు. కానీ మన దగ్గర ఉన్న ఆర్టిస్టులను మరచిపోతున్నారు. హైదరాబాద్ లో దాదాపు 150 మంది కెమెరా మెన్లు పనిలేక ఖాళీగా ఉంటున్నారు. చివరికి మేకప్ మెన్, హెయిర్ డ్రెస్సర్లను కూడా బయట నుంచే తీసుకొస్తున్నారు. మన కోసం పెట్టుకున్న ‘మా’ను నడపడానికి కూడా మన తెలుగు వాళ్లు పనికిరారా? దీనికోసం బయటనుంచి మరోకరిని తెచ్చుకోవాలా? ఒక్కసారి ఆలోచించండి. ఇది మన ఆర్గనైజేషన్. మనం నడుపుకోలేమా? మనకు చేతకాదా? బయటనుంచి ఎవరో వచ్చి మనకు నేర్పించాలా? కొంచెం ఆలోచించండి’ అని రవిబాబు అన్నారు.

For More News..

మరోసారి పెట్రో వాత.. రూ.100 దాటిన డీజిల్ ధర

పండుగపూట గ్యాస్ ధరల మంట.. మరో రూ. 15 పెంపు

దళితులకు మూడెకరాలు ఇస్తామని మేమెక్కడా చెప్పలేదు