మరోసారి పెట్రో వాత.. రూ.100 దాటిన డీజిల్ ధర

మరోసారి పెట్రో వాత.. రూ.100 దాటిన డీజిల్ ధర

న్యూఢిల్లీ: పెట్రో భగభగలు కొనసాగుతున్నాయి. వరుసగా నాలుగోరోజు ఆయిల్ కంపెనీలు చమురు ధరలను పెంచాయి. దీంతో కొండెక్కిన ఆయిల్ ధరల్ని చూసి సామాన్యులు గగ్గోలు పెడుతన్నారు. మంగళవారం లీటరు పెట్రోల్‌‌పై 25 పైసలు, డీజిల్ మీద 30 పైసల్ని పెంచిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. ఇవ్వాళ మరోసారి భారం మోపాయి. పెట్రోల్‌‌పై 31 పైసలు, డీజిల్ మీద 38 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 102 రూపాయల 95 పైసలకు చేరగా.. డీజిల్  ధర 91.45 రూపాయలకు పెరిగింది. అలాగే ముంబైలో పెట్రోల్ ధర 108. 98 రూపాలయకు, డీజిల్  ధర 99.18 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర 107.08 రూపాయలకు, డీజిల్ ధర రూ.99. 75కు చేరింది. రాష్ట్రంలోని కరీంనగర్‌‌లో లీటర్ డీజిల్ ధర రూ.100 ఉండగా.. ఆదిలాబాద్‌లో రూ.102, కామారెడ్డిలో రూ.101, మహబూబ్ నగర్‌లో రూ.101గా ఉంది.   

మరిన్ని వార్తల కోసం:

ఆ కారు నాదే.. అందులో నా కొడుకు లేడు: మంత్రి అజయ్ మిశ్రా

లవ్​మ్యారేజ్​ చేసుకుందని బిడ్డను తీస్కపోయిన్రు

‘రామాయణ్’ రావణుడు ఇకలేడు..

ఖాళీలుంటే నోటిఫికేషన్లు ఎందుకియ్యరు?

మాస్ కాంబో ‘అఖండ’ రెడీ