పండుగపూట గ్యాస్ ధరల మంట.. మరో రూ. 15 పెంపు

పండుగపూట గ్యాస్ ధరల మంట.. మరో రూ. 15 పెంపు

ఎల్పీజీ గ్యాస్ ధరలను కంపెనీలు మరోసారి పెంచాయి. అక్టోబర్ 1న రూ. 25 పెంచిన కంపెనీలు.. నేడు మరోసారి ధరలు పెంచాయి. నాన్ సబ్సిడీ గృహ వినియోగ సిలిండర్ (ఎల్పీజీ)  ధరను ఈసారి 15 రూపాయలు పెంచాయి. రెండు నెలల్లో నాలుగుసార్లు గ్యాస్ ధరలు పెంచడంతో సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగష్టు 18న 25 రూపాయలు, సెప్టెంబర్ లో మరో 25 రూపాయలు, అక్టోబర్ 1న 25 రూపాయలు, ఇప్పుడు మరో 15 రూపాయలు పెంచడంతో సామాన్యుడిపై పెను భారం పడుతోంది.  తాజాగా పెరిగిన ధరలతో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర ఢిల్లీ, ముంబాయిలలో రూ. 899.50 పైసలకు చేరింది. హైదరాబాద్ లో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ. 952కి చేరింది. కాగా.. అత్యధికంగా కోల్‎కతాలో రూ. 926లకు చేరింది. ఆ తర్వాత చెన్నైలో రూ. 915.50 పైసలకు చేరింది. కాగా.. తాజాగా పెంచిన ధరలతో ఐదు కిలోల సిలిండర్ ధర 502 రూపాయలకు పెరిగింది. సబ్సిడీ కింద లభించే సిలిండర్ ధర గత జనవరి 1 నుంచి ఇప్పటివరకు ఏకంగా రూ. 205 పెరిగింది. గత అక్టోబర్ లో రూ. 646.50 పైసలున్న ధర.. ఈ అక్టోబర్ వచ్చేసరికి రూ. 937కు చేరింది.

For More News..

‘రామాయణ్’ రావణుడు ఇకలేడు..

దళితులకు మూడెకరాలు ఇస్తామని మేమెక్కడా చెప్పలేదు