బాలీవుడ్ స్టార్ సల్మాన్​ఖాన్​కు గన్​లైసెన్స్​ మంజూరు

బాలీవుడ్ స్టార్ సల్మాన్​ఖాన్​కు గన్​లైసెన్స్​ మంజూరు

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్ ఖాన్ కు ముంబయి పోలీసులు గన్ లైసెన్స్ ను మంజూరు చేశారు. ఇటీవల ఆయన్ని, ఆయన తండ్రిని చంపుతామంటూ బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో తుపాకీ లైసెన్స్‌ కోరుతూ ముంబయి పోలీసు హెడ్‌క్వార్టర్‌లో కమిషనర్‌ వివేక్‌ ఫాన్సాల్కర్‌ను కలిసి ఇటీవలే దరఖాస్తు చేశారు. ఈ మేరకు ఆయన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్న ముంబయి పోలీసులు... తాజాగా గన్​ లైసెన్స్​ను మంజూరు చేశారు. 

గత కొద్ది రోజుల క్రితం పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా గతే హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీంఖాన్ లకు బెదిరింపు లేఖ వచ్చింది. జాగింగ్ చేసే ప్రాంతంలో లేఖను అందుకున్న సల్మాన్.. త్వరలో సిద్ధూ మూసేవాలా లాంటి పరిస్థితే మీకు ఎదురవుతుందనే వార్తను ఆ లేఖలో ఉండడం గమనించారు. ఈ విషయం సల్మాన్ ఖాన్ పోలీసులకు చెప్పగా.. వారు వాంగ్మూలం తీసుకొని, ఆయన నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ బెదిరింపు లేఖ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా సల్మాన్.. గన్ లైసెన్స్ ఇవ్వమని కోరుతూ దరఖాస్తు చేశారు. అయితే ఈ ఘటనను కొందరు మాత్రం పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారని, ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ ఆయనపై ఆరోపణలు చేశారు.