సాయం కోసం ఒక్కరోజే 31 వేల మెస్సెజ్ లు

సాయం కోసం ఒక్కరోజే 31 వేల మెస్సెజ్ లు

కరోనా దేశంలోకి ఎంటరైనప్పటి నుంచి నటుడు సోనూసూద్ ఎందరికో సాయం చేస్తూ వస్తున్నాడు. వివిధ రాష్టాలలో చిక్కుకున్న వారికోసం ప్రత్యేకంగా విమానాలు, రైళ్లు ఏర్పాటు చేయించి మరీ వారివారి స్వస్థలాలకు పంపిస్తున్నాడు. ఉపాధి కోల్పోయినవారికి ఉపాధి కల్పించడం, జాబ్ కోల్పోయినవారికి జాబ్ ఇప్పించడం, కరోనా బారిన పడిన పేదవారికి చికిత్స చేయించడం.. ఇలా ఎన్నో విధాలుగా ప్రజలకు సేవ చేస్తూ.. వారికి దేవడిలా మారాడు. కరోనా కష్టకాలంలో తమను ఆదుకుంటున్న సోనూసూద్ ను ప్రజలందరూ గుండెల్లో పెట్టుకుంటున్నారు. కులం, మతం, భాష, రాష్ట్ర అనే తేడా లేకుండా.. సాయం కోరిన ప్రతి ఒక్కరికి కాదనకుండా ఏదో రూపంలో సాయం చేస్తూనే ఉన్నాడు.

సాయం కోసం ప్రతిరోజు సోషల్ మీడియాలో సోనూసూద్ కు విపరీతంగా మెసెజ్ లు పెడుతున్నారు. గురువారం ఒక్కరోజే ఆయనకు సోషల్ మీడియా ద్వారా 31 వేలకు పైగా మెసెజ్ లు వచ్చాయి. మెయిల్ ద్వారా 1137, ఫేస్ బుక్ ద్వారా 19,000, ఇన్ స్టాగ్రామ్ ద్వారా 4812, ట్విట్టర్ ద్వారా 6741 మెసెజ్ లు వచ్చినట్లు స్వయంగా సోనూసూద్ ట్వీట్ చేశారు. ఒక్కరోజే ఇంతమంది సాయం కోరారంటే.. దేశంలో ఇంకా ఎంతమంది సాయం కోసం ఎదురుచూస్తున్నారో చెప్పక్కర్లేదు.

‘ఈ ఒక్కరోజే సాయం కోసం 31,690 మెసెజ్ లు వచ్చాయి. ఒక మనిషిగా వారందరికీ సాయం చేయడం కుదరకపోవచ్చు. కానీ, నాకు వీలైనంత మందికి సాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంతమందిలో ఎవరికైనా నా సాయం అందకపోతే నన్ను క్షమించండి’ అంటూ సోనూ ట్వీట్ చేశాడు.

For More News..

భారీ వర్షాలకు కుంగిన జంపన్న వాగు వంతెన

చేపల అమ్మకాన్ని నిషేధించిన కేరళ ప్రభుత్వం

ధోని ఆ రాత్రంతా జెర్సీతోనే ఉన్నాడు.. ఏడ్చాడు..

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోడీ