Suhas: ఆ విషయంలో నాకు ఎలాంటి టెన్షన్ లేదు.. సుహాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Suhas: ఆ విషయంలో నాకు ఎలాంటి టెన్షన్ లేదు.. సుహాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ నటుడు సుహాస్(Suhas) ఈ మధ్య వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే అమ్మాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాఠీ సూపర్ హిట్ అందుకున్న ఈ నటుడు ప్రస్తుతం తన తరువాతి సినిమా రిలీజ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న కొత్త సినిమా ప్రసన్నవదనం(Prasannavadanam). అర్జున్ వైకే(Arjun YK) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ(Payal Radhakrishna) హీరోయిన్ గా నటిస్తున్నారు. కేవలం మొహం మాత్రమే కనిపించకపోవడం అనే వింత వ్యాధి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read:మేము ఎన్ని హిట్లు కొట్టినా పట్టించుకోవట్లేదు.. మలయాళ హీరో ఫాహద్ షాకింగ్ కామెంట్స్

టీజర్ తో మంచి ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసిన ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు హీరో సుహాస్. ఇందులో భాగంగా యాంకర్.. ప్రతీ సినిమాకి ఒక కొత్త దర్శకుడుని పరిచయం చేస్తున్నారు. కొత్త దర్శకులతో వర్క్ చేసేటప్పుడు టెన్షన్ ఉండదా.. అని అడగగా. దానికి సమాధానంగా సుహాస్ మాట్లాడుతూ.. ఒకసారి నేను కథ విని ఒకే చేసిన తరువాత అస్సలు దానిగురించి పట్టించుకోను. పూర్తిగా దర్శకుడిని నమ్ముతాను. 

ఇక కొత్త దర్శకులతో వర్క్ చేసేటప్పుడు నాకు ఏమాత్రం భయం ఉండదు. కారణం. తమని తాము నిరూపించుకోవాలని కసి ఉంటుంది వారిలో. సినిమా కోసం ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉంటారు. అందుకే కొత్త దర్శకులతో పనిచేసేటప్పుడు నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు.. అని చెప్పుకొచ్చాడు సుహాస్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి మంచి అంచనాల మధ్య వస్తున్న సుహాస్ ప్రసన్నవదనం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.