మెస్మరైజ్ చేసే యాక్షన్‌‌తో కాటాలన్‌‌.. పుష్ప తర్వాత తృప్తిని ఇచ్చిన పాత్ర: సునీల్

మెస్మరైజ్ చేసే యాక్షన్‌‌తో కాటాలన్‌‌.. పుష్ప తర్వాత తృప్తిని ఇచ్చిన పాత్ర: సునీల్

ఆంటోనీ వర్గీస్, దుషార విజయన్ లీడ్ రోల్స్‌‌లో పాల్ జార్జ్ దర్శకత్వంలో షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన మలయాళ చిత్రం ‘కాటాలన్’. సునీల్, కబీర్ దుహాన్ సింగ్, హరి శంకర్ కీలకపాత్రలు పోషించారు. గురువారం పాన్‌‌ ఇండియా వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌‌లో తెలుగు వెర్షన్‌‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.  

నటుడు సునీల్ మాట్లాడుతూ ‘‘పుష్ప’ తర్వాత నా కెరీర్‌‌‌‌ సర్‌‌‌‌ప్రైజింగ్‌‌ మోడ్‌‌లో పడింది. ఎప్పుడు ఏ భాష నుంచి సినిమా వస్తుందో తెలియడం లేదు. ఇందులో ‘మారి’ అనే పాత్ర పోషించా. చాలా తృప్తిని ఇచ్చిన పాత్ర. గతంలో ఇలాంటిది ఎప్పుడూ చేయలేదు. వెరైటీగా, వెర్సటైల్‌‌గా ఉండే క్యారెక్టర్.  డైరెక్టర్ పాల్ ఈ కథ చెప్పినప్పుడు చాలా సర్‌‌ప్రైజ్ అయ్యా. ప్రతిదీ చాలా లాజిక్‌‌తో ఉంటుంది. యూనివర్సల్‌‌గా అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా’ అని చెప్పాడు.  

నటుడు కబీర్ దుహాన్ సింగ్ మాట్లాడుతూ ‘‘మార్కో’ తర్వాత ఈ బ్యానర్‌‌‌‌లో చేస్తున్న రెండో సినిమా ఇది. అద్భుతంగా తెరకెక్కించారు.  యాక్షన్ సీన్స్  మెస్మరైజ్ చేస్తాయి.  సునీల్ గారితో కలిసి పనిచేయడం హ్యాపీ. ఇదొక  హార్డ్‌‌కోర్ యాక్షన్ మూవీ. తప్పకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది’ అని చెప్పాడు. నటుడు హరీష్‌‌తో పాటు క్యూబ్స్‌‌ ఎంటర్‌‌‌‌టైన్మెంట్స్‌‌ ఆజాద్‌‌ పాల్గొన్నారు.