మెలెనా వ్యాధి వల్లే తారకరత్నకు చికిత్స కష్టమవుతోంది : వైద్యులు

మెలెనా వ్యాధి వల్లే తారకరత్నకు చికిత్స కష్టమవుతోంది : వైద్యులు

 సినీ నటుడు నందమూరి తారకరత్నఆరోగ్యం క్షణక్షణం క్షీణిస్తోందని డాక్టర్లు చెప్పారు. ఆయన గత కొంతకాలంగా మెలెనా వ్యాధితో బాధపడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. మెలెనా రోగులకు విపరీతమైన రక్తస్రావం ఉంటుందని.. ముక్కు, చెవులతో సహా అనేక చోట్ల నుండి రక్తస్రావం అవుతుందన్నారు. తీవ్రమైన గుండెపోటు తర్వాత రక్త నాళాలలో రక్తస్రావం జరిగినట్లు వైద్యులు గుర్తించారు. రక్తస్రావం కారణంగా గుండెకు వైద్యపరమైన సవాల్ ఎదురైందని..  కృత్రిమ గుండె కదలిక కోసం ఎక్మో మెషిన్ ఇంప్లాంటేషన్ చేసినట్లు చెప్పారు. తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందన్న డాక్టర్లు.. ప్రత్యేక వైద్య బృందంతో అధునాతన చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.