Teja Sapru: యూనియన్ లీడర్, డాన్, పొలిటీషియన్.. అసలు ట్విస్ట్ చెప్పేసిన నటుడు

Teja Sapru: యూనియన్ లీడర్, డాన్, పొలిటీషియన్.. అసలు ట్విస్ట్ చెప్పేసిన నటుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) హీరోగా వస్తున్న సినిమాలలో ఓజీ(OG) ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజీత్(Sujeeth) తెరకెక్కిస్తున్న ఈ స్టైలీష్ గ్యాంగ్ స్టర్ ఎంటర్టైనర్ పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. మళయాళ బ్యూటీ ప్రియాంక మోహన్(Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హస్మీ(Imran Hasmi), శ్రీయ రెడ్డి(Shreya reddy) తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. అందుకే ఓజీ గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. దానికి కారణం.. పవన్ మిగతా ఏ సినిమాలకు లేనంత బజ్ ఈ సినిమాకు క్రియేట్ అవడమే. 

ఇక ఓజీ సినిమా నుండి విడుదలైన టీజర్ ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ స్వాగ్, ఎక్సలెంట్ విజువల్స్, థమన్ ఎలక్ట్రిఫైయింగ్ బీజేఎం వెరసి ఈ టీజర్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. ఈ టీజర్ తర్వాత ఓజీపై అంచనాలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఇక అప్పటినుండి ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ కు వస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఇక తాజాగా ఓజీలో విలన్ రోల్ చేస్తున్న నటుడు తేజ సప్రూ ఈ సినిమా గురించి, పవన్ కళ్యాణ్ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఆయన నటించిన రజాకార్ అనే సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఓజీ సినిమా గురించి మాట్లాడుతూ.. నేను చాలా కాలంగా తరువాత ఓజీ వంటి భారీ సినిమాలో నటిస్తున్నారు. సినిమా ఎవరు ఊహించని రేంజ్ లో ఉంటుంది. ఈ సినిమాలో నేను మెయిన్ విలన్. ఇమ్రాన్ హస్మీ నా కొడుకుగా చేస్తున్నాడు. ఇక పవన్ ఈ సినిమాలో యూనియన్ లీడర్, డాన్, పొలిటీషియన్ గా మూడు పాత్రలో కనిపిస్తారు.. అంటూ ఓజీ సినిమాలో మెయిన్ ట్విస్ట్ ను రివీల్ చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు.

ఇక ఓజీ విషయానికి వస్తే.. దాదాపు రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తరువాత నిర్మాత డీవీవీ దానయ్య నుండి వస్తున్న సినిమా కావడంతో ఓజీపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు రవి కె చంద్రన్ కెమెరామెన్ గా చేస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.