_9m6np42B7e.jpg)
డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో మెప్పిస్తున్న వరుణ్ తేజ్, తన కెరీర్‌లో మొదటిసారి నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘బాక్సర్’. సయీ మంజ్రేకర్ హీరోయిన్. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అల్లు బాబి, సిద్ధు ముద్ద నిర్మాతలు. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్‌ని పరిస్థితులు చక్కబడ్డాక స్టార్ట్ చేయనున్నారు. ఈ విషయమై నిర్మాత సిద్ధు మాట్లాడుతూ ‘ఇప్పటికే డెబ్భై శాతం షూటింగ్ పూర్తయింది. నెక్స్ట్ షెడ్యూల్‌లో వరుణ్‌తో పాటు ఇతర నటీనటులపై సినిమాకి ఎంతో కీలకమైన యాక్షన్ సీన్స్ తీయబోతున్నాం. ఇందుకోసం భారీ స్టేడియం సెట్ వేశాం. హాలీవుడ్‌లో ‘టైటాన్స్’, బాలీవుడ్‌లో ‘సుల్తాన్’ లాంటి చిత్రాలకి యాక్షన్ సీన్స్ కంపోజ్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అదిరిపోయే యాక్షన్ సీన్స్ కంపోజ్ చేస్తున్నారు. షూటింగ్ కంప్లీటయ్యాక రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’ అని చెప్పారు. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. విదేశాల్లో బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకున్న వరుణ్ తేజ్, లాక్ డౌన్ సమయంలోనూ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్‌లో కనిపించడానికి ఫుల్‌గా ప్రిపేరవుతున్నాడు.