కెరీర్ ప్లానింగ్ అంటే దేవరకొండదే..

V6 Velugu Posted on Jun 01, 2021

కెరీర్‌‌‌‌ని ప్లాన్ చేసుకోవడం విజయ్ దేవరకొండని చూసి నేర్చుకోవచ్చు. కన్ను మూసి తెరిచేలోగా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించాడు. ఓపక్క సినిమాల్లో నటిస్తూనే వ్యాపారంలోకీ దిగాడు. మరోవైపు నిర్మాతగానూ ప్రయాణం ప్రారంభించాడు. కింగ్ ఆఫ్ ద హిల్ పేరుతో బ్యాన‌‌ర్ స్టార్ట్ చేసి, ‘మీకు మాత్రమే చెప్తా’ అంటూ దర్శకుడు తరుణ్ భాస్కర్‌‌‌‌ని హీరోగా పెట్టి సినిమా నిర్మించాడు. ప్రస్తుతం తన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో ‘పుష్పక విమానం’ తీస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే మూడో మూవీని ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. పృథ్వీ సేనారెడ్డి అనే దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట విజయ్. ప్రస్తుతం యాక్టర్స్‌‌ని, టెక్నీషియన్స్‌‌ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారట. అందరూ కొత్త వారితోనే తెరకెక్కించాలనుకుంటున్నట్టు సమాచారం. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌‌మెంట్ వస్తుందట.  ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ డైరెక్ట్‌‌ చేస్తున్న ‘లైగర్’లో బాక్సర్‌‌‌‌గా నటిస్తున్నాడు విజయ్. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అనన్యపాండే హీరోయిన్. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నాడు విజయ్.

Tagged Liger, Movies, Vijay Devarakonda, tollywood, Anand Devarakonda, king of the hill, pushpaka vimanam

Latest Videos

Subscribe Now

More News