Hero Vishal: రాష్ట్రంలో ప్రజలకు సరైన వసతుల్లేవు..త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్న

Hero Vishal: రాష్ట్రంలో ప్రజలకు సరైన వసతుల్లేవు..త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్న

హీరో విశాల్ (Vishal) తెలుగు కుర్రాడైనప్పటికీ కోలీవుడ్ లో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. తాను చేసిన సినిమాలు, తెలుగు తమిళ భాషల్లో రిలీజై బాక్సాఫీస్ వద్ద విజయాల్ని సొంతం చేసుకున్నాడు. గుర్తింపు, హోదా కోసం కాకుండా ప్రజలకు ఇచ్చిన మాట కోసం పరితపిస్తుంటాడు. తనకు చేతనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో  దేవి ఫౌండేషన్ ద్వారా ఎందరినో ఆదుకుంటూ విద్యార్థులను చదవిస్తు..రైతులకు సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 

తాజాగా హీరో విశాల్ చెన్నైలో జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్తు గురించి ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ‘అతి త్వరలో నేను రాజకీయాల్లోకి వస్తున్నా. 2026 లో తమిళనాడు రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని..తాను కూడా ఓ పార్టీని స్థాపిస్తానని అన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు సరైన వసతుల్లేవు. వారికి చాలా రకాలుగా సేవ చేసి..అన్నిసరైన  సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నా’’అని ప్రకటించారు. అలాగే ‘ఏ రాజకీయ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా?’ అని జర్నలిస్ట్ ప్రశ్నించగా..‘‘అలాంటిదేమీ లేదు.ముందు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా.ఆ తర్వాతే మిగిలిన విషయాలు,పొత్తు గురించి ఆలోచిస్తానని’’విశాల్ బదులిచ్చారు. ప్రస్తుతం విశాల్ మాట్లాడిన మాటలు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.