పడుకొని ఉంటే ముప్పై సినిమాలు అయ్యేవి.. మరీ ఇంత బోల్డుగానా!

పడుకొని ఉంటే ముప్పై సినిమాలు అయ్యేవి.. మరీ ఇంత బోల్డుగానా!

నటి పాయల్ ఘోష్(Payal ghosh) సంచలన కామెంట్స్ చేశారు. సినిమా ఇండస్ట్రీలో పడుకుంటేనే పనులు అవుతాయని తనదైన స్టైల్లో స్పందించారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో చర్చనియ్యాంశం అయ్యాయి.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. పాయల్ ఘోష్ తాజాగా తన కెరీర్ లో 11వ సినిమాను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇందుకోసమే ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. "ఇది నా కెరీర్ లో 11వ సినిమా.. ఇండస్ట్రీలోకి వచ్చీ చాలా ఏళ్ళే అయింది కానీ.. ఇప్పటివరకు కేవలం 11 సినిమాలు మాత్రమే చేశాను. కొందరితో బెడ్ షేర్ చేసుకుని ఉంటే..  ఇది నాకు 30వ సినిమా అయ్యేది. పెద్ద సినిమాల్లో అవకాశాలు రావాలంటే బెడ్‌రూమ్‌ కి వెళ్లాల్సిందే. లేదంటే కష్టమే’’ అంటూ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం పాయల్ ఘోష్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక నటి పాయల్ ఘోష్ విషయానికి వస్తే.. 17 ఏళ్లకే సినీపరిశ్రమలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా కనిపించి మెప్పించింది. ఆతరువాత మిస్టర్ రాస్కెల్ వంటి సినిమాల్లో కూడా నటించింది పాయల్ ఘోష్.