హనుమంతుడి తెగువ, ధైర్యం కలిసొచ్చేలా వరుణ్ తేజ్, లావణ్య కొడుకు పేరు !

హనుమంతుడి తెగువ, ధైర్యం కలిసొచ్చేలా వరుణ్ తేజ్, లావణ్య కొడుకు పేరు !

మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ బిడ్డకు వాయువ్ తేజ్ కొణిదెల అని పేరు పెట్టారు. ఈ సందర్భాన్ని వరుణ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దేవుడు తమకు ప్రసాదించిన గొప్ప వరానికి పేరు పెట్టామని వరుణ్ తేజ్ 27 సెకన్ల వీడియోతో పాటు, పిల్లాడిని ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేశాడు. వాయువ్ తేజ్ అనే పేరుకు ఉన్న అర్థం ఏంటో ఆ 27 సెకన్ల వీడియోలో చెప్పారు. వాయువ్ తేజ్ అనే పేరు అంజనీ పుత్రుడైన ఆంజనేయ స్వామిని సూచిస్తుంది. హనుమంతుడి అసామాన్యమైన బలం, శ్రీరాముడి పట్ల అచంచలమైన భక్తి, హనుమాన్ ధైర్యసాహసాలు.. వాయువ్ తేజ్ అనే పేరులో ఉన్నాయని ఆ వీడియోలో వివరించారు.

ఆరేళ్లు ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి 2023 నవంబర్‌ 1న ఇటలీలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మెగా హీరో వరుణ్ తేజ్-హీరోయిన్ లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులయ్యారు. 2025, సెప్టెంబర్ 10 న హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో లావణ్య పండంటి మగబిడ్డకు జన్మినిచ్చింది. అదే రోజున.. చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సెట్స్‌ నుంచి నేరుగా హాస్పిటల్కి వెళ్లి వరుణ్‌, లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్’ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. 2017లో విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. కానీ.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ బంధం చిగురించింది. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. వీరి పెళ్లికి అల్లు, మెగా కుటుంబాలతో పాటు అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి తర్వాత కూడా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ సినిమా కెరీర్ను కొనసాగించారు. లావణ్య త్రిపాఠి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు చేయగా.. వరుణ్ తేజ్ కూడా డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం ‘ఘాజీ’ సినిమా డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో కొరియన్ హారర్ సినిమా చేస్తున్నాడు.