బాలీవుడ్ నటి ఆదా శర్మ(Adah Sharma) ఆసక్తికర కామెంట్స్ చేశారు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ చేసుకున్న ఫ్లాట్ కొన్నారని ఆమె గురించి కొంత కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ వార్తలపై స్పందించారు ఆదా శర్మ. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ఆమె సిద్ధార్థ్ కానన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన ఫ్లాట్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి నేను చాలా మంది హృదయాల్లో ఉన్నాను. ఏ విషయం గురించి మాట్లాడటానికైనా సరైన సమయం ఒకటి ఉంటుంది. నిజంగా నేను.. ఆ ఫ్లాట్ చూడ్డానికి వెళ్లగానే మీడియా దృష్టి నాపై పడింది. నేను చాలా ప్రైవేట్ వ్యక్తిని. నా సినిమాల కోసం ప్రజల దృష్టిలో ఉండాలనుకుంటాను కానీ, వ్యక్తిగత విషయాల వల్ల కాదు. నా ప్రైవసీని కాపాడుకునే బాధ్యత నాది.. అంటూ చెప్పుకొచ్చారు ఆదా. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్( Sushanth Singh Rajputh ) 2020లో ముంబై బాద్రాలో తాను అద్దెకు ఉంటున్న గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటినుండి ఆ ఫ్లాట్ ఖాళీగానే ఉంది. ఆశ్రమంలోనే నటి ఆదాశర్మ ఆ ప్లాటును కొనుగోలు చేస్తున్నారు అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీ( Bollywood Industry )లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అదే విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చారు ఆదా శర్మ.