సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ చాలామందే ఉంటారు. ఆ కోవకు చెందిందే ఆండ్రియా కూడా. ఈ తమిళమ్మాయి టాలీవుడ్ ప్రేక్షకులకూ నటిగా పరిచయమే. అయితే తాను ప్రొఫెషనల్ సింగర్ కూడా. తమిళం, తెలుగు భాషలతోపాటు మిగతా భాషల్లోనూ పాడుతోంది. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తన గాత్రాన్ని అందిస్తోంది. సింగింగ్ షోల్లో జడ్జ్‌గా కనిపిస్తోంది. నటిగా ఏ పాత్ర ఇచ్చినా వందశాతం మార్కులు కొట్టేస్తుంది. రీసెంట్గా ఆమె నటించిన ‘మాస్క్’ అనే సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది.
నాటకాల్లో నటించా.. యాక్టర్ అవ్వాలని కాదు!
ఆండ్రియా జెరెమియా (Andrea Jeremiah).. తమిళనాడులోని అరక్కొనమ్లో పుట్టింది. తండ్రి మద్రాస్ హైకోర్ట్‌లో లాయర్‌గా పనిచేసేవాడు. గ్రాడ్యుయేషన్ వరకు చెన్నైలోనే చదివింది. అయితే ఆండ్రియాకు సంగీతం మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో ఎనిమిదేండ్ల వయసులో క్లాసికల్ పియానో నేర్చుకుంది. పదేళ్లు వచ్చేసరికి సింగింగ్ అండ్ మ్యూజిక్ కంపోజింగ్ ట్రూప్‌లో చేరింది.
►ALSO READ | Ram Charan: సైలెంట్‌గా శ్రమిస్తూ.. భారీ ఛాలెంజ్‌కు సిద్ధమైన హీరో రామ్ చరణ్.. క్రేజీ అప్డేట్!
మ్యూజికల్ జర్నీ చేస్తూనే కాలేజీలో చదువుకుంటున్నప్పుడు నాటకాల్లో నటించేది. ‘ది మద్రాస్ ప్లేయర్స్’ నిర్వహించిన ఎన్నో స్టేజీ షోల్లో తాను పార్టిసిపేట్ చేసింది. విమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో స్టూడెంట్ ప్రెసిడెంట్‌గా ఉండేది. అంతేకాదు ఆండ్రియా సొంతంగా ఒక కంపెనీని కూడా నిర్వహిస్తోంది. ‘ది షో మస్ట్ గో ఆన్’ పేరుతో ప్రొడక్షన్ స్టార్ట్ చేసి కళను, కళాకారులను ప్రమోట్ చేసింది. ఒక కాలేజీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. కానీ, అప్పుడు ఆమెకు ఇంట్రెస్ట్ లేకపోవడంతో అన్నీ రిజెక్ట్ చేసింది.
యాక్టింగ్ కెరీర్
ఆండ్రియా తన నాటకాల ప్రయాణాన్ని గిరీశ్ కర్నాడ్‌తో మొదలుపెట్టింది. 2006లో లియో కాఫీ అడ్వర్టైజ్మెంట్లో నటించింది. ‘పొదిగై చానెల్’ అనే సిరీయల్లో కూడా యాక్ట్ చేసింది. దేశవ్యాప్తంగా పర్ఫార్మెన్స్లు ఇచ్చింది. తర్వాత ఆమె గౌతమ్ వాసుదేవ్ సినిమాలో పాట పాడింది. అయితే, డైరెక్టర్ ఆమెను చూసి తాను తీయబోయే మరో సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం నటించమని అడిగాడు. అలా ఆండ్రియా ‘పచ్చైకిలి ముత్తుచారమ్’ సినిమాలో కళ్యాణి అనే పాత్ర పోషించింది. 2010లో రిలీజ్ అయిన ‘యుగానికి ఒక్కడు’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ‘మంకత’ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసింది. అక్కడినుంచి వరుసగా ఏడాదికి రెండు మూడు ప్రాజెక్ట్‌లతో బిజీగా గడుపుతోంది.
సింగర్‌గా..
2005లోనే సింగర్‌గా ప్రొఫెషనల్ కెరీర్ స్టార్ట్ చేసింది. మొదట పాడిన పాట ‘అపరిచితుడు’ సినిమాలోని ‘కన్నుమ్ కన్నుమ్ నోకియా’. ఆ పాట ఎంతో పేరు తెచ్చింది. అదే ఏడాది తెలుగులో వచ్చిన ‘అందరివాడు’ సినిమాలో ‘అందరివాడు...’ అనే టైటిల్ సాంగ్ పాడింది.
తెలుగు, తమిళంలో ఎన్నో పాటలు పాడింది. ఇప్పటికీ తను ప్లే బ్యాక్ సింగర్‌గా పాటలు పాడుతూనే ఉంది. తను నటించే సినిమాల్లోనూ తన పాట వినిపిస్తుంది. సింగింగ్ షోల్లో పర్ఫార్మెన్స్లు కూడా ఇచ్చింది. జడ్జ్‌గానూ వ్యవహరించింది. 2006 నుంచే ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది. రీసెంట్గా రిలీజ్ అయిన ‘మాస్క్’ సినిమాలోనూ ‘ఇధుధన్ ఎంగల్ ఉలగమ్’ పాట పాడింది.
సంగీతమే నా ప్రపంచం
ఈ ప్రపంచంలో నేను ఎక్కువగా ప్రేమించేది సంగీతాన్నే. నా సొంత ట్యూన్స్‌తో నేను పాడాలి అనుకుంటాను. నా మొదటి పాటే శంకర్ సినిమా అపరిచితుడు కావడం, ఆ పాట తెచ్చిన సక్సెస్ ఎప్పటికీ మర్చిపోలేను. తమిళంలో ఎక్కువ పాటలు పాడాను. తెలుగులో అడపాదడపా పాడుతూ ఉంటాను. ఇవే కాకుండా మలయాళం, కన్నడ, హిందీలోనూ ఒక్కో ప్రాజెక్ట్‌కి పాడాను. ఏ భాషలో పాడే అవకాశం వచ్చినా అస్సలు వదులుకోను. సింగింగ్ అంటే నాకు అంత ఇష్టం.
సింగర్, మ్యుజిషియన్‌గా పేరు తెచ్చుకోవడమే నాకిష్టం. వీటన్నిటితోపాటు బ్రీతింగ్ స్పేస్.. అంటే కొంత సమయం మనకోసం మనం కేటాయించడం ఇంపార్టెంట్ అని నమ్ముతాను. చాలామంది నటీనటులు అలాగే చేస్తుంటారు. వాళ్లకు కూడా అది వర్కవుట్ అవుతుంది. కానీ, నాకు అది వర్కవుట్ కావట్లేదు. నేను ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను.
అదే మొదటిసారి
సినిమాల విషయానికొస్తే కథలో నా రోల్ ఏదైనా డైరెక్టరే ఎంచుకుంటారు. నేను ఫలానా సినిమా చేయాలి అని ఏం అనుకోను. ప్రతి సినిమా ఎక్స్‌పీరియెన్స్ నాకు ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ‘వడ చెన్నై’ సినిమాలో నాకు ఏ పాత్ర వస్తుందో అనే ఐడియా కూడా లేదు. రెండు రోజులు షూటింగ్ పూర్తయ్యాక నేను నేరుగా డైరెక్టర్ దగ్గరకి వెళ్లి ఈ ప్రాజెక్ట్‌లో నుంచి నన్ను తీసేసినా పర్లేదు, చెప్పండి అని అడిగా. అదే మొదటిసారి నేను అలా అడగడం.
కానీ, ఆ సినిమా వల్ల నాకు ఎంతో పేరు వచ్చింది. నేను ఆంగ్లో ఇండియన్ని. కానీ, వడ చెన్నై సినిమా తర్వాత ఒరిజినల్ తమిళ అమ్మాయిలా అనిపించింది. అంత పవర్ఫుల్ రోల్ చేశాక, ఫేమ్ వచ్చింది కానీ ఆ తర్వాత అవకాశాలు మాత్రం రాలేదు. అంటే నాతో ఇంకేం పాత్ర చేయిస్తే బాగుంటుంది? అనే ఆలోచన ఎవరికీ కలగలేదేమో. అప్పుడు వెట్రిమారన్ నాతో ‘కొంచెం వేచి ఉండు. ఇక నుంచి నీకోసం పాత్రలు రాయడం మొదలుపెడతారు’ అన్నారు.
