మీరు బతకండి, మమ్మల్ని బతకనివ్వండి

మీరు బతకండి, మమ్మల్ని బతకనివ్వండి

లైగర్ సినిమా భారీ ప్లాప్ నేపథ్యంలో ఛార్మి కౌర్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తనతో సహా పూర్ కనెక్ట్స్ కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్ని రోజులు సోషల్ మీడియా నుంచి  బ్రేక్ తీసుకుంటున్నానని, పూరి కనెక్ట్స్ మళ్లీ ఇంకా మంచి పెద్ద ప్రాజెక్ట్ తో తిరిగి వస్తుందని చెప్పుకొచ్చారు. అప్పటివరకు మీరు బతకండి, మమ్మల్ని బతకనివ్వండి అంటూ ఆమె ఆసక్తికర పోస్ట్ చేసింది. కానీ ఈ నిర్ణయం వెనక ఉన్న కారణాలు మాత్రం వ్యక్తం చేయలేదు.

ఒకవైపు ఛార్మి చేస్తోన్న జనగణమన సినిమా సైతం ఆగిపోయిందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి తోడు ఇటీవల విజయ్ దేవర కొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సైతం తీవ్ర నష్టాలను మిగిల్చింది. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోల్స్, కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకూ ఈ మూవీ నెగిటివ్ టాక్ పై చిత్రబ-ృందంలోని ఎవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే ఛార్మి చేసిన రీసెంట్ పోస్ట్ పలు సందేహాలకు తావిస్తోంది. ఈ పోస్ట్ వెనక JGM సినిమా ఆగిపోయింద‌నే వార్తలు, లైగర్ సినిమా ప్లాపే కారణమా అన్న విషయాలు తెలియాలంటే మళ్లీ ఛార్మి ఇచ్చే అప్ డేట్ వరకు వేచి చూడాల్సిందే.