కాంగ్రెస్లో నటి దివ్యవాణికి కీలకబాధ్యతలు

కాంగ్రెస్లో నటి దివ్యవాణికి కీలకబాధ్యతలు

సినీ నటి దివ్యవాణికి కాంగ్రెస్ కీలక పదవిని కట్టబెట్టింది. నిన్న(నవంబర్ 22) పార్టీలో చేరిన దివ్యవాణికి పీసీసీ ప్రచార కమిటీలో చోటు కల్పించింది. పీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ గా దివ్వవాణిని నియమించింది.ఈ మేరకు చైర్మన్ మధుయాష్కీ గౌడ్, కాంగ్రెస్ ప్రచార కమిటీ ఆమోదం తెలిపారు. ఎన్నికల సమయంలో చేరికలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టిని సారించింది. అందులో భాగంగానే  దివ్యవాణిని పార్టీలోకి ఆహ్వానించింది. పీసీపీ ప్రచారకమిటీలో కీలక బాధ్యతలు అప్పగించింది.

గతంలో టీడీపీలో సుదీర్ఘ కాలం పనిచేసి రాజీనామా చేశారు దివ్యవాణి. టీడీపీ మహానాడు వేదికపై ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన దివ్యవాణి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.. పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరుతుందని ప్రచారం జరిగినా.. దివ్యవాణి కాంగ్రెస్  పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు..  ఈ క్రమంలో నిన్న  కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు దివ్వవాణి. చేరిక సమయంలో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు  దివ్యవాణిని పీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ గా నియమించారు.