దెయ్యంగా కనిపించనున్న హన్సిక

 దెయ్యంగా కనిపించనున్న హన్సిక

రౌడీ బేబీ, 105 మినిట్స్, మై నేమ్ ఈజ్ శ్రుతి లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో బిజీగా ఉన్న హన్సిక.. ఇప్పుడు మరో ఫిమేల్ సెంట్రిక్ సినిమాని సెలెక్ట్ చేసుకుంది. శబరి, గురు శరవణన్ దర్శకత్వంలో ‘గార్డియన్’ అనే సినిమా చేస్తోంది. రియల్‌‌ లైఫ్‌‌లో ఎందరో అనాథ పిల్లల్ని దత్తత తీసుకుని వారికి గార్డియన్‌‌గా ఉందామె. ఇప్పుడొక సినిమాలో ఆ పాత్ర పోషించబోతోంది. అయితే ఇందులో ఆమె ఓ మామూలు అమ్మాయిలా కాదు.. దెయ్యంగా కనిపించనుంది. రీసెంట్‌‌గా ఆమె లుక్‌‌ని కూడా లాంచ్ చేశారు.

చూడటానికే భీతిగొల్పేలా ఉంది హన్సిక లుక్. ఇది ఒక మంచి ఆత్మ కథ అని తెలుస్తోంది. ఓ పాపకి ఆ ఆత్మ గార్డియన్‌‌గా ఉంటుంది. తనని అన్ని ప్రమాదాల నుంచీ కాపాడుతుంది. అసలామె ఎందుకలా చేస్తోంది, వాళ్లిద్దరికీ ఏమిటి సంబంధం అనేది స్టోరీ. ప్రముఖ తమిళ దర్శకుడు విజయ్ చందర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో చంద్రకళ, కళావతి లాంటి హారర్ చిత్రాలతో మంచి విజయాల్ని ఖాతాలో వేసుకున్న హన్సిక.. మళ్లీ ఇన్నాళ్లకు అదే జానర్‌‌‌‌ మూవీతో వస్తోంది. మరి ఈసారి కూడా సక్సెస్‌‌ సాధిస్తుందేమో చూడాలి.