హైదరాబాద్ లో సందడి చేసిన జాన్వీ కపూర్

హైదరాబాద్ లో సందడి చేసిన జాన్వీ కపూర్

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హైదరాబాద్ లో సందడి చేసింది. నానక్ రామ్ గూడాలో బ్లేడర్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ పేరుతో గ్రాండ్ ఫ్యాషన్ షో జరిగింది. ఈ షోలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు అమిత్ అగర్వాల్, నూర్ కరీం రూపొందించిన డిజైనర్ కలెక్షన్స్ ధరించి జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్ చేసింది.

ఇండియన్ అండ్ ఇండో వెస్ట్రన్, వెడ్డింగ్ కలెక్షన్స్ ను మోడల్స్ ప్రదర్శించారు. డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఈ ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. ఆరెంజ్ కలర్ లెహంగాలో జాన్వీ కపూర్ షో టాపర్ గా నిలిచింది.