Mrunal Thakur: మృణాల్కు వందకు వంద మార్కులు..ఎక్కడో తెలుసా?

Mrunal Thakur: మృణాల్కు వందకు వంద మార్కులు..ఎక్కడో తెలుసా?

‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది మృణాల్ ఠాకూర్.ఈ చిత్రంతో ఇతర భాషల్లోనూ మంచి గుర్తింపును అందుకుంది. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ మూవీలో మృణాల్ తనలోని హవాభావాలకు తిరుగేలేదు.తనలోని అందానికి కొదువులేదు.ఇక నటనలో నిజాయితీకి తగ్గేదేలేదు.ఇది మృణాల్ ఏర్పరుచుకున్న సిగ్నేచర్.

ఇక లేటెస్ట్ మృణాల్ ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమాకు సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ స్పందన అంత ఇంత కాదు. కానీ, మృణాల్ పాత్ర గురించి అయితే మఞ్చభి మార్కులే పడుతున్నాయి.కానీ,తన హ్యాట్రిక్ సక్సెస్ కి మాత్రం పెద్ద బ్రేక్ పడిందనే చెప్పుకోవాలి.

ఈ సినిమాలో మృణాల్ చేసిన ఇందు రోల్ అందరికి కనెక్ట్ అవుతుంది.ఫస్టాఫ్ లో  నవ్వుతూ ఎంతో అందంగా స్క్రీన్ పై కనిపించిన మృణాల్ ..సెకండాఫ్లో భావోద్వేగాలను కూడా పండించడంలో సక్సెస్ అయింది.ఇందు పాత్రకు మాత్రం వందకు వంద మార్కులు తెచ్చుకుందని ఫ్యాన్స్ అంటున్నారు. 

అయితే,డైరెక్టర్ పరుశురాం రాసిన స్క్రిప్ట్ కు,ఇందు పాత్రకు సరైన న్యాయం మాత్రం చేసింది.కానీ, ఇక్కడ దర్శకుడు..మృణాల్ రోల్ ను కంప్లీట్ గా డెవలప్ చేసి ఉంటే మాత్రం సినిమా గురించి ఇంకా చాన్నాళ్లు మంచిగా మాట్లాడుకునేవాళ్ళం.మృణాల్ పాత్రకు ఇంకా ఎక్కువ స్కోప్ ఉండటం కనిపించింది. కానీ, దాన్ని ఎక్కువ వాడుకోలేదు.

మొత్తానికి ఫ్యామిలీస్టార్ స్టేటస్ ఎలా ఉన్న మృణాల్ కు వచ్చే నష్టం అయితే లేదు.అందుకేనేమో మృణాల్ పై నెటిజన్స్ కూడా ఎటువంటి నెగిటివ్ ప్రచారం చేయడం లేదు.కానీ,ఇక్కడ విజయ్ దేవరకొండపై మాత్రం పూర్తి నెగిటివ్ ప్రచారం జరుగుతోంది.ఏదేమైనా, విజయ్ కి ఈ సారి కూడా పెద్ద సక్సెస్ అందుకోలేదని మాత్రం నిజమని అర్ధమవుతుంది.