
సీనియర్ నటి నగ్మా(Nagma) 90ల్లో కుర్రకారు కలల రాణి. ఆమెను చూసేందుకే థియేటర్లకు జనం క్యూ కట్టేవారు. సినిమాలపై అంతలా నగ్మా గ్లామర్ పనిచేసింది. తర్వాత రాజకీయాలతో బిజీగా మారిపోయింది. కానీ, పెళ్లికి మాత్రం ఎందుకనో దూరంగా ఉంటూ వచ్చింది.
గతంలో క్రికెటర్ గంగూలీ, నటులు రవికిషన్, శరత్ కుమార్ వంటి వారితో నగ్మా రిలేషన్‌పై ఎన్నో రూమర్లు వచ్చాయి. ఈ నటి ఎవరిని పెళ్లి చేసుకుంటుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసేవారు. ఆమె సిస్టర్స్ జ్యోతిక, రోషిణి మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటే నగ్మా మాత్రం ఇప్పటికీ సింగిల్ గానే ఉండిపోయింది.
తాజాగా తన పెళ్లిపై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘అందరు అమ్మాయిల్లాగే నేను కూడా పెళ్లి, పిల్లలు, కుటుంబం ఉండాలని ఎంతో ఆశ పడేదాన్ని. కాలం కలిసొస్తే త్వరలోనే పెళ్లి చేసుకుంటానేమో.. అదే జరిగితే చాలా సంతోషిస్తాను. సంతోషం అనేది జీవితాంతం ఉండాలని నేను భావిస్తాను’అని నగ్మా తెలిపింది.