జెట్ స్పీడులో దూసుకెళ్తోన్న ప్రియమణి

జెట్ స్పీడులో దూసుకెళ్తోన్న ప్రియమణి

మొదట్లో హీరోయిన్లుగా వెలిగిన చాలామంది అవకాశాలు తగ్గాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంటారు. ప్రియమణి కూడా అదే చేసింది. అయితే మిగతా వారిలా కాకుండా జెట్ స్పీడులో దూసుకెళ్తోంది. మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ రావడంతో తన టాలెంట్‌‌ని గతంలో కంటే ఎక్కువగా ప్రూవ్ చేసుకునే చాన్స్ దొరుకుతోంది ప్రియమణికి. నారప్ప, భామాకలాపం, విరాటపర్వంలోని పాత్రలే అందుకు ఉదాహరణ. ఇంకా ఆమె చేతిలో ఐదారు సినిమాలున్నాయి.

ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌తో చాన్స్ సంపాదించినట్టు తెలుస్తోంది. అది మరేదో కాదు.. ‘పుష్ప 2. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌‌‌‌ తెరకెక్కించిన ‘పుష్ప’ సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టీ సీక్వెల్‌‌పై ఉంది. దీని గురించి రోజుకో వార్త పుట్టుకొస్తుండటంతో ఏది నిజమో ఏది పుకారో అర్థం కాని కన్‌‌ఫ్యూజన్ ఏర్పడుతోంది. రీసెంట్‌‌గా ప్రియమణి గురించిన న్యూస్ బైటికొచ్చింది. పార్ట్‌‌ 2లో విజయ్ సేతుపతి కూడా యాక్ట్ చేయబోతున్నాడని, అతని భార్యగా ప్రియమణి కనిపించబోతోందని జోరుగా చర్చ జరుగుతోంది. ఇది నిజమో కాదో తెలియాలంటే ప్రియమణి కానీ, ‘పుష్ప’ టీమ్ కానీ రియాక్టవ్వాల్సిందే!