
రెజీనా కాసాండ్రా (Regena Cassandrra).. సినీ ఫ్యాన్స్కు పరిచయం అక్కర్లేని పేరు. 2005లో ‘కందా నాల్ ముదల్’ అనే తమిళ చిత్రంతో రెజీనా సినీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సుధీర్ బాబు నటించిన SMS ‘శివ మనసులో శృతి’ చిత్రంతో తెలుగులో కెరీర్ స్టార్ట్ చేసి ఆడియన్స్ను అలరించింది.
ఈ క్రమంలో రెజీనా తనదైన నటనతో తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈ ఏడాదితో (2025) రెజీనా.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు 34 ఏళ్ళు.. ఇక తన 20 ఏళ్ల సినీ కెరీర్లో దాదాపు 50 సినిమాలు చేసింది. ప్రస్తుతం వరుస సినిమాలతో సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
రెజీనా సినిమాలివే:
కొత్తజంట, పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాల్లో హీరోయిన్‌గా మెప్పిస్తూనే, నేనేనా, ఎవరు, శాకిని డాకిని లాంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించింది. ఇటీవల అజిత్‌తో కలిసి నటించిన తమిళ చిత్రం ‘విదా మయూర్చి’తో పాటు బాలీవుడ్ చిత్రం ‘జాట్’తో మంచి ఆదరణ దక్కించుకుంది.
త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులతో ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం తెలుగులో ఓ రెండు చిత్రాలతో పాటు తమిళంలో మూడు సినిమాలు, కన్నడ, హిందీ భాషల్లో రెండు చిత్రాలతో బిజీగా ఉంది.