బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ . సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక అజ్ఞాత వ్యక్తికి 15 కోట్లు బదిలీ కావడంలో రియా పాత్ర వున్నట్టు అనుమానంగా వుందని, దీనిపై విచారణ జరపాలని ఆయన తండ్రి కేకే సింగ్ బీహార్ లోని పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో.. బీహార్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. ఇదే సమయంలో ముంబై పోలీసులు కూడా రియాను విచారిస్తున్నారు. ఈ క్రమంలో ముంబై పోలీసులకు కేసును అప్పగించాలని సుప్రీం కోర్టును రియా ఆశ్రయించింది. రెండు పోలీసు బృందాలు ఒకే కేసును విచారిస్తుండటం సరికాదని పిటిషన్ లో తెలిపింది.
అయితే బీహార్ నుంచి వచ్చిన పోలీసు బృందం ముంబైలో కేసును విచారిస్తోంది. ఇవాళ(బుధవారం) ఆరుగురు వ్యక్తులను పోలీసులు విచారించారు. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
