
రోహిణి హట్టంగడి, రోహిణి ముల్లేటి, సముద్రఖని, హిమాంశు పోపూరి, సౌమ్య, అనన్య నన్నపనేని ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఒక మంచి ప్రేమకథ’. అక్కినేని కుటుంబరావు దర్శకత్వంలో హిమాంశు పోపూరి నిర్మిస్తున్నారు. ఈటీవీ విన్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నటి రోహిణి ముల్లేటి మాట్లాడుతూ ‘ఇటీవల విడుదలైన ‘కోర్ట్’ చిత్రంలోని నా పాత్రకు మంచి ఆదరణ దక్కింది.
ఎప్పుడూ మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. అయితే ఇందులోని నా పాత్రను చూస్తే ఆడియెన్స్ కోప్పడతారు’ అని చెప్పారు. సీనియర్ నటి రోహిణి హట్టంగడి మాట్లాడుతూ ‘ఈ సినిమా నా మనసుకి హత్తుకుంది. ఇంత మంచి చిత్రంలో నన్ను పార్ట్ చేసిన కుటుంబరావు గారికి, ఓల్గా గారికి థాంక్స్’ అని చెప్పారు.
అందరిలోనూ ఆలోచన రేకెత్తించేలా ఈ సినిమాను తెరకెక్కించానని దర్శకుడు అక్కినేని కుటుంబరావు అన్నారు. ‘ఒక మంచి ప్రేమకథ’కు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని నిర్మాత హిమాంశు చెప్పారు. రచయిత్రి ఓల్గా, మ్యూజిక్ డైరెక్టర్ కె.ఎం. రాధాకృష్ణన్, నటి సౌమ్య తదితరులు పాల్గొన్నారు.