
మేజర్ మూవీ చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది హీరోయిన్ సదా. సినిమా ఫస్ట్ ఆఫ్‌లోనే భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక కంటతడి పెట్టుకుంది. సినిమా క్లైమాక్స్ లో అయితే బోరున విలపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాని చూసిన అనంతరం సదా మాట్లాడుతూ.. " ఉగ్రదాడి జరిగిన టైమ్ లో నేను ముంబైలోనే ఉన్నాను. ఇప్పుడు మేజర్ మూవీ చూస్తుంటే ఆనాటి రోజులు గుర్తుకువచ్చాయి. అ సంఘటనలను తెర మీద చూస్తుంటే కన్నీళ్లు ఆగలేదు. కొన్ని సన్నివేశాల్లో అయితే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. చాలా రోజుల తర్వాత ఒక సినిమా నన్ను ఏడిపించింది, చాలా గర్వంగా అనిపిస్తుంది" అని సదా చెప్పుకొచ్చింది. కాగా అడవి శేష్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఈ మూవీకి శశికిరణ్ దర్శకత్వం వహించారు. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అవుతున్నారు.