Sonam Kapoor : సోనమ్ కపూర్ బేబీ బంప్ ఫోటోలు.. ప్రిన్సెస్ డయానా స్టైల్‌లో లుక్స్ వైరల్!

Sonam Kapoor : సోనమ్ కపూర్ బేబీ బంప్ ఫోటోలు.. ప్రిన్సెస్ డయానా స్టైల్‌లో లుక్స్ వైరల్!

బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్, నటి సోనమ్ కపూర్ రెండోసారి గర్భం దాల్చారు. ఈ శుభవార్తను స్వయంగా సోనమ్ తనదైన స్టైలో తెలిపారు. గురువారం ( నవంబర్ 20న ) తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. ఈ వార్త ఆమె అభిమానులకు, సినీ వర్గాలకు ఆనందాన్ని పంచాయి.  సోనమ్ గులాబీ రంగు దుస్తుల్లో మెరిపోతూ ... తన బేబీ బంప్ ను ప్రదర్శిస్తూ ఇచ్చిన లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.

గత కొన్ని నెలలుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ.. ఈ ఫోటోలను షేర్ చేసింది సోనమ్.. ఈ పోస్ట్ లో ఆమె కేవలం "Mother" అనే ఒక్క పదాన్ని క్యాప్షన్‌గా జోడించి అందరి దృష్టిని ఆకర్షించింది.  తను ధరించిన హాట్ పింక్ ఔట్‌ఫిట్, 80వ దశకంలో ప్రిన్సెస్ డయానా ధరించిన దుస్తులను గుర్తుచేసింది. ప్యాడెడ్ షోల్డర్స్‌తో ఉన్న ఈ సూట్‌లో సోనమ్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 

ALSO READ : రజనీకాంత్ టైమ్స్ .. 

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ , సునీతా కపూర్ దంపతుల కుమార్తె సోనమ్. 2018లో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను ఆమె పెళ్లి చేసుకుంది.  ఈ దంపతులకు ఇప్పటికే 3 సంవత్సరాల వాయు అనే కుమారుడు ఉన్నాడు.  ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ శుభవార్త ఆహుజా, కపూర్ కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంది. వచ్చే ఏడాది ప్రారంభంలో సోనమ్ రెండో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉందని సమాచారం. సోనమ్ చివరిగా 2023లో విడుదలైన 'బ్లైండ్ (Blind)' చిత్రంలో కనిపించారు. తల్లిగా, నటిగా, ఫ్యాషన్ ఐకాన్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సోనమ్, ఈ రెండో గర్భధారణ ప్రకటనతో మరోసారి వార్తల్లో నిలిచారు.