
ప్రభాస్ ఫస్ట్ మూవీ ‘ఈశ్వర్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి కొంత గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ‘సుందరకాండ’. నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించారు. ఆగస్టు 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీదేవి విజయ్ కుమార్ చెప్పిన విశేషాలు.
‘‘పెళ్లి, ఫ్యామిలీ కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నా. ఇప్పుడు పిల్లలు పెద్ద అవడంతో సినిమాలు చేయడానికి అవకాశం దొరికింది. రీ ఎంట్రీలోనూ హీరోయిన్‌గా నటించడం చాలా హ్యాపీగా ఉంది. కొత్త పాయింట్‌తో వస్తున్న సినిమా ఇది.
నా క్యారెక్టర్ మీనింగ్‌ఫుల్‌గా ఉంటూనే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆడియెన్స్‌కు ఫ్రెష్ ఫీల్‌నిస్తుంది. ఇందులో ఓ సీన్ కోసం స్కూల్ డ్రెస్ వేసుకునే అవకాశం వచ్చింది. అది చాలా మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్. ఇప్పటివరకు నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. మా అన్న అరుణ్ విజయ్ ద్వారా నారా రోహిత్ నాకు పరిచయం. ఆయన చాలా కూల్‌గా ఉంటారు. తనతో వర్క్ చేయడం హ్యాపీనెస్ ఇచ్చింది.
వెంకీకి ఫస్ట్ మూవీ అయినా అనుభవం ఉన్న డైరెక్టర్‌లా తీశారు. ఆయన విజన్ చాలా క్లియర్‌గా ఉంది. ఈ సినిమాకి లియోన్ జేమ్స్ అందించిన మ్యూజిక్ ప్లస్ పాయింట్. ప్రతి పాట డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రభాస్ గారు, నేను ‘ఈశ్వర్’ మూవీతో లాంచ్ అవడంతో మా మధ్య ఫ్రెండ్‌షిప్ అలాగే ఉంది. ఇప్పుడు బిగ్ స్టార్ అయినప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు. చిన్నపిల్లాడిలానే నవ్వుతూ మాట్లాడతారు.
ఇక నాకు అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలని ఉంది. కథలో ప్రాధాన్యత ఉండే స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయాలని భావిస్తున్నా’’అని శ్రీదేవి చెప్పుకొచ్చింది.