మేలో ఉస్తాద్​ సెట్స్​లోకి శ్రీలీల

మేలో ఉస్తాద్​ సెట్స్​లోకి శ్రీలీల

టాలీవుడ్​ హీరోయిన్​ శ్రీలీల బాడా ప్రాజెక్టులను చేస్తోంది. ఉస్తాద్​ భగత్​ సింగ్​ సినిమాలో ఆమె హీరోయిన్​గా తీసుకున్నట్లు తెలుస్తోంది. హరీష్​ శంకర్​ డైరెక్షన్​లో మైత్రి మూవీ మేకర్​ సంస్థ నిర్మిస్తున్న ఉస్తాద్​ భగత్​ సింగ్​ సినిమా మేలో సెట్స్​ మీదకు వెళ్లబోతోంది. ఈనెల 30 నుంచి రెగ్యులర్​ షూటింగ్​ స్టార్ట్​ కానుంది. కానీ మేలో జరిగే  షూటింగ్​లో శ్రీలీల పాల్గొనబోతున్నట్లు సమాచారం. ధమాకా మూవీతో హిట్​ అందుకున్న శ్రీలీల, తమిళ సినిమా రీమేక్​ వినొదయా సీతం, గ్యాంగ్​ స్టార్​ సినిమాలను చేస్తోందని వదంతులు వచ్చినా ఆమె నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.