రైటర్ పద్మభూషణ్ ఒక ఎమోషనల్ రైడ్ : టీనా శిల్పరాజ్

రైటర్ పద్మభూషణ్ ఒక ఎమోషనల్ రైడ్ :  టీనా శిల్పరాజ్

సుహాస్, టీనా శిల్పరాజ్ జంటగా షణ్ముఖ ప్రశాంత్ రూపొందించిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా టీనా శిల్పరాజ్ మాట్లాడుతూ ‘ఇదొక ఎమోషనల్ రైడ్. కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా ఉంటాయి. మంచి ఫీల్, గుడ్ ఎక్స్‌‌పీరియన్స్ ఇస్తుంది.  నా పాత్ర పేరు సారిక.  విజయవాడ అమ్మాయి. పద్మభూషణ్ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే వేసిన ప్రీమియర్స్‌‌కి మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది.  సుహాస్ ‘కలర్‌‌‌‌ఫొటో’ సినిమా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన సినిమాతో పరిచయం కావడం నాకు చాలా స్పెషల్. డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్‌‌కు చాలా క్లియర్ విజన్ ఉంది. రోహిణి, ఆశిష్ విద్యార్ధి లాంటి సీనియర్స్‌‌తో కలిసి నటించడం గ్రేట్ ఫీలింగ్.  ఇంతకుముందు అసిస్టెంట్‌‌ డైరెక్టర్‌‌‌‌గా వర్క్ చేయడంతో స్ర్కీన్‌‌పై ఎలా చేయాలనేది తెలుసుకున్నా. ఈ సినిమా జర్నీలో ఇంకా మరిన్ని విషయాలు నేర్చుకున్నాను’అని చెప్పింది.