
నటి ఉర్ఫీ జావేద్(Uorfi Javed)కు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. గురువారం రాత్రి ఆమె ముంబై నుంచి గోవా వెళ్లేందుకు విమానం ఎక్కింది. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తున్న తనను కొందరు ఆకతాయిలు ఈవ్ టీజింగ్ చేశారని తెలిపింది. ఈ వీడియో క్లిప్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. తన పేరును పిలుస్తూ అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆవేదన వ్యక్తం చేసింది.
తాను వాగ్వాదానికి దిగడంతో మరో వ్యక్తి వచ్చి నా స్నేహితులు మద్యం తాగి ఉన్నారు.. క్షమించాలని కోరాడని తెలిపింది. తాగేసి ఉంటే మహిళలతో విచక్షణ లేకుండా ప్రవర్తిస్తారా?.. ఇలాంటి బిహేవియర్‌ను ఎట్టి పరిస్థితుల్లో క్షమించలేనని పేర్కొంది. తాము పబ్లిక్ ఫిగర్‌ను మాత్రమేనని పబ్లిక్ ప్రాపర్టీని కాదని మండిపడింది. ఇంటర్నెట్లో ఉర్ఫీ జావేద్ చేసే ఫొటో షూట్లు హాట్ టాపిక్‌గా మారుతుంటాయి.