అత్యాచారం చేస్తే ఉరి శిక్ష.. చట్టంలో సంచలన మార్పులు.. టచ్ చేయాలంటే భయపడాలి

అత్యాచారం చేస్తే ఉరి శిక్ష.. చట్టంలో సంచలన మార్పులు.. టచ్ చేయాలంటే భయపడాలి

భారత చట్టాల్లో భారీ మార్పులకు  సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం.   ఈ మేరకు  కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో  మూడు కొత్త  బిల్లులను ప్రవేశ పెట్టారు. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ చట్టాల  స్థానాల్లో కొత్త  బిల్లులను ప్రవేశ పెట్టారు. ఈ   బిల్లులపై మరింత చర్చించేందుకు స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేశారు. 

ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్  స్థానాల్లో   ఐపీసీకి బదులు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత,సీఆర్పీసీకి బదులుగా భారతీయ న్యాయ సంహిత,  ఎవిడెన్స్ యాక్ట్ కు బదులు భారతీయ  సాక్ష్య, బిల్లులను తెస్తున్నట్లు అమిత్ షా ప్రకటించారు. 

అంతేగాకుండా క్రిమినల్ ప్రొసిజర్స్ లో 313 మార్పులు చేశారు. ఇకపై  మహిళలపై అత్యాచారం కేసుల్లో ఇక మరణ శిక్ష,   పోలీసుల సెర్చింగ్ లో వీడియో రికార్డింగ్ తప్పనిసరి, అలాగే  మూకదాడులకు ఏడేళ్ల జైలు శిక్ష,  గ్యాంగ్ రేప్ కు 20 ఏళ్ల జైలు శిక్ష , ఎక్కడి నుంచైనా ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కల్పించేలా  మార్పులు చేసింది.  కేసులు సత్వర పరిష్కారం కోసమే ఈ మార్పులు చేస్తున్నట్లు తెలిపారు అమిత్ షా.